వాళ్ళ మనస్పర్ధలు సరిదిద్దేందుకు సిద్ధమైన ఏపీ సి‌ఎం ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్టార్టింగ్ లో చాలా కంట్రోల్ లో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఎక్కడికక్కడ వైరస్ కట్టడి చేయగలుగుతున్నారు అని జాతీయ మీడియా సైతం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే ఎప్పుడైతే ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన బయట పడిందో దేశంలో పాటు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగటంతో మంత్రులు మరియు అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ క్వారంటైన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది.Andhra Pradesh CM Y S Jagan for lockdown only in red zonesదాదాపు మార్చ్ 29 నుండి సీన్ ఒక్కసారిగా మారటంతో..వైసిపి ప్రజాప్రతినిధుల పరిస్థితి పరిగెత్తి ఇచ్చినట్లయింది. అయితే ఇటువంటి టైములో ఒక మతానికి చెందిన వాళ్లు వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అనేక కామెంట్లు అప్పట్లో ప్రభుత్వంలో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగాయి. ఇదే టైమ్ లో ఇటీవల వైసీపీ పార్టీలో ఒక మంత్రి ఆ మతాన్ని టార్గెట్ చేస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు వైసీపీలో మైనారిటీ వర్గం వర్సెస్ మిగతా వర్గాలు అన్నట్టుగా సీన్ క్రియేట్ అయిందట.

 

చాలావరకు వైసీపీలో మైనార్టీ నాయకులు…జగన్ ఇస్తున్న ఆదేశాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట. ఇళ్ల కే పరిమితమై పోయారట. దీంతో ఈ విషయం తెలుసుకున్న వైయస్ జగన్ వాళ్ల మధ్య మనస్పర్ధలు సరిదిద్దేందుకు రెడీ అయినట్లు సమాచారం. ముఖ్యంగా చూసుకుంటే మైనార్టీ ఓట్లు ఎక్కువగా వైసీపీ కే గత సార్వత్రిక ఎన్నికలలో పడటంతో… ఇటువంటి మనస్పర్ధలు రావటం పార్టీకి ఏమాత్రం క్షేమం కాదని జగన్ భావించి ఈ గొడవలు సద్దుమణిగి చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ సందర్భంగా వైసిపి పార్టీ మైనార్టీ నాయకులతో జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news