బ్రేకింగ్ డెసిష‌న్‌.. ఎంపీపై వేటుకు జ‌గ‌న్ సిద్ధం..!

వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుపై వేటుకు రంగం సిద్ధ‌మైందా?  వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఇక తెం చుకునేందుకే మొగ్గు చూపించారా?  తాజా ప‌రిణామాలు జ‌గ‌న్‌కు మంట పుట్టిస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. న‌ర‌సాపురం నుంచి గెలిచిన పార్ల‌మెంటు స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణం రా జు..ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. నాయ‌కుల‌ను దుమ్మెత్తి పోశారు. ఎమ్మెల్యేల‌ను పందుల‌తో పోల్చా రు. అయినా కూడా జ‌గ‌న్ మౌనంగానే ఉన్నారు. ఒక్క మాట కూడాతూల‌లేదు. కానీ, క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు నాయ‌కులు ర‌ఘుపై ప్ర‌తివిమ‌ర్శ‌లు చేశారు. ఇది సాధార‌ణంగా ఎక్క‌డైనా జ‌రిగేదే.

ఈ ప‌రిణామాల‌తో అయినా..ర‌ఘు త‌న స్థాయి ఏంటో.. పార్టీలో త‌న స్థానం ఏంటో తెలుసుకుని ఉంటే బా గుండేది. కానీ, ఆయ‌న ఏకంగా జ‌గ‌న్‌కు కుడి భుజం వంటి పార్టీ నాయ‌కుడు, గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికా రంలోకి తెచ్చేందుకు అహ‌ర‌హం శ్ర‌మించిన నాయ‌కుడు విజ‌య‌సాయి రెడ్డి సెంట్రిక్‌గా విరుచుకుప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా..పార్టీ ఉనికికే ప్ర‌మాదం తెచ్చేలా అస‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా వాడు కుంటారంటూ.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప‌రిస్థితి విష‌మించింది. ఈ క్ర‌మంలోనే సాయిరెడ్డి ఆయ‌న‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా కూడా ర‌ఘులో మార్పు క‌నిపించ‌క‌పోగా.. ఎదురు దాడి ప్రారంభించారు.

తాను రాజ్యాంగ ప‌రిర‌క్ష‌కుడిన‌ని, తెలుగు మీడియంపై తాను లేవ‌నెత్తిన విష‌యాలు స‌బ‌బుగానే ఉన్నాయ ‌ని. పార్టీనే త‌న మేనిఫెస్టోలో రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చింద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ ‌లు చేశారు. తాజాగా సోమ‌వారం షోకాజ్ నోటీసుకు ఆరు పేజీల ఉత్త‌రం రాశారు. దీనిలోనూ ఎక్క‌డా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేయాలేదు. పైగా విజ‌య‌సాయిరెడ్డిని మ‌రోసారి త‌ప్పుబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రో దుందుడుకు చ‌ర్య చేశారు. బీజేపీ నాయ‌కుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కొనియాడుతూ.. సోష‌ల్ మీడియాలో ఒక పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ ప‌రిణాల‌ను నిశితంగా గ‌మ‌నించిన సీఎం జ‌గ‌న్‌.. ఇక‌, ర‌ఘుపై ఉపేక్షించి లాభం లేద‌ని నిర్ణ‌యించుకున్నారు. సోమ‌వారం సాయంత్రంలోగా ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిపై సోమ‌వారం అత్య‌వ‌స‌రంగా భేటీ అయిన‌… జ‌గ‌న్‌.. ర‌ఘుపై వేటుకే సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. మొత్తానికి ర‌ఘు వ్య‌వ‌హారం సోమ‌వారంతో ముగిసిపోతుంద‌ని, త‌మ పార్టీకి త‌ల‌నొప్పి వ‌దిలి పోతుంద‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.