ఏపీ నిరుద్యోగులకు జగన్‌ తీపికబురు..1,64,155 మందికి ఉద్యోగాలు

-

ఏపీ నిరుద్యోగులకు జగన్‌ తీపికబురు చెప్పారు. అచ్యుతాపురం సెజ్‌లో టైర్ల కంపెనీని ప్రారంభించిన వైయస్‌.జగన్‌..ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. దేవుడి దయతో ఒక పరిశ్రమ ఇవాళ ప్రారంభమైందని.. రెండో ఫేజ్‌ పనులకూ శంకుస్థాపన చేశామన్నారు. యొకహొమా కంపెనీ ప్రపంచంలోనే 5–6 స్థానాల్లో ఉందని.. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరమని వెల్లడించారు.

రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో మరో 56 అతిభారీ, భారీ పరిశ్రమలు దాదాపుగా రూ. 1,54,000 పెట్టుబడితో ఏర్పాటవుతున్నాయని వివరించారు. దీని ద్వారా 1,64,155 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని ప్రకటన చేశారు. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతూ ఉన్నాయి… ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నంబర్‌ 1గా గత మూడేళ్లుగా అవార్డులు తీసుకుంటున్నామన్నారు.

మొట్ట మొదటి సారిగా ఈ సారి సర్టిఫికేషన్‌ చేయటానికి దాని తీరును కూడా మార్చారని… ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు. అలా రూల్స్‌ మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్‌ 1 ర్యాంకు సాధిస్తోందని తెలిపారు. ప్రతి అడుగులో కూడా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news