కెసిఆర్ కిసాన్ ద్రోహి – వైఎస్ షర్మిల

-

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన దగ్గర్నుంచి రాజకీయాలలో షర్మిల తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కోడలిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతానంటూ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే షర్మిలకు తెలంగాణలో జనం మద్దతు అనూహ్యంగా లభిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాలలో దూసుకుపోతున్నారు షర్మిల.

ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ” పంట రుణాలు లేవు. ఉచిత ఎరువులు లేవు. సబ్సిడీ విత్తనాలు లేవు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు. పంట నష్టపోతే పరిహారం లేదు. రైతు ఆత్మహత్య చేసుకుంటే సాయం లేదు. కౌలు రైతులకు దిక్కూమొక్కూ లేదు. కేవలం రూ.5వేల రైతు బంధు ఇచ్చి.. రైతు ప్రభుత్వమని, సిగ్గులేకుండా గొప్పలు చెప్తున్నాడు కిసాన్ ద్రోహి KCR” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news