రోజు ఉసిరి టీ తాగడం వల్ల ఎన్ని లాభాలో.. ఈ సీజన్‌లో బెస్ట్‌ డ్రింక్..!!

-

మనం తినేవి, తాగేవి కరెక్టుగా ఉంటే..ఆరోగ్యం కూడా బాగుంటుంది.. ఎప్పుడైతే ఇవి గాడితప్పుతాయో..ఆరోగ్యం కూడా రూట్‌ మార్చుకుంటుంది. బరువు పెరుగడం అనేది ఈరోజుల్లో అందరికీ ఉండే కామన్‌ సమస్య.. కొందరికి వారసత్వంగా వస్తే..మరికొందరి కొనితెచ్చుకుంటారు. జంక్‌ఫుడ్స్‌, సరైన జీవనశైలి పాటించకుండా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. బరువు పెరగడం ఎంత తేలికైనా విషయమే..తగ్గడం కూడా అంతే తేలికైన పని..కానీ మనకు కంట్రోల్‌, ఓర్పు ఉండాలి. శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అవి ఎంత కఠినంగా ఉన్నా సరే..నేను చేయగల్తా అని నమ్మకం ఉండాలి..టీ తాగడం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది.. అలా టీ తాగే బరువును కూడా తగ్గించుకోవచ్చు..కాకపోతే.మీరు రోజూ తాగే టీ కాదు..ఉసిరి టీ.. ఉసిరి టీ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని చెబుతోంది ఆయుర్వేదం.
ఉసిరిలో ఉండే గుణాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. చలికాలంలో ఈ ఉసిరి టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు రావు.. కొందరికి రెండు గంటలకు ఒకసారి టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీలు, టీలు అలా అధికంగా తాగడం వల్ల శరీరంలో కెఫీన్ చేరి, ఇతర సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. టీలలో పంచదార కూడా కలుపుతారు. దీని వల్ల డయాబెటిస్ ముప్పు ఇంకా పెరుగుతుంది. కాబట్టి రెండు మూడు గంటలకు ఒకసారి టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు, సాధారణ టీలను వదిలిపెట్టి ఉసిరి టీని తాగడం ఉత్తమం…ఇందులో ఎలాంటి పంచదార కలపరు. దీన్నీ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా. ఇందులో విటమిన్ సి, పీచు పదార్థం, క్యాల్షియం ఉంటాయి..

ఉసిరి టీ ఎలా చేయాలి..?

రెండు ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్క తీసుకోవాలి.
ఉసిరికాయలోని గింజను బయటపడేసి మిగతా భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయండి.
అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై మీకు ఎంత టీ కావాలో అన్ని నీళ్లు పెట్టి అందులో ఉసిరి, అల్లం ముక్కలు వేసి మరిగించాలి.
మరుగుతున్న నీటిలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేయండి. వేసిన వెంటనే స్టవ్ ఆపేయండి.. స్పూన్‌తో బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి.
వడకట్టి కప్‌లో పోసుకుని తాగడమే..
ఉసిరి, అల్లం రెండూ కూడా చలికాలంలో శరీరానికి రక్షణ కల్పిస్తాయి.. ఉసిరికాయ అందుబాటులో లేనప్పుడు బయట దొరికే ఉసిరి పొడిని కూడా కలుపుకోవచ్చు. అలాగే శొంటి పొడి కూడా ఉపయోగించవచ్చు. వీటిని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందని, బరువు కూడా త్వరగా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మం త్వరగా ముడతలు పడదు. పైగా జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. జుట్టు రాలడం అనే సమస్యే ఉండదు..కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా ఉసిరికి ఉంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తాయి. మధుమేహం ఉన్న వారికి కూడా ఈ టీ చాలా మంచిది. కాబట్టి సాధారణ టీ కాఫీలను వదిలి ఉసిరి టీని ట్రై చేయండి. రిజల్ట్‌ మీరే చూస్తారు..!!

Read more RELATED
Recommended to you

Latest news