కేసీఆర్ తాగుబోతు.. అందుకే ఇలా చేస్తున్నారు : షర్మిల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ తాగుబోతు అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడనీ.. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదనీ మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనన్నారు.

Sharmila
Sharmila

మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందని…మేము దీక్ష చేసాకే ఏదైనా కదలిక వచ్చిందని ఆమె తెలిపారు. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200మంది పోలీసులు మాపై దాడిచేశారని.. మమ్మల్ని బలవంతంగా కర్లలోకి ఎక్కించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

పోలీసులు దొంగల్లా వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని..శాంతియుతంగా దీక్ష చేసే హక్కు మాకు లేదా…? అని ప్రశ్నించారు.దీక్ష చేస్తున్న మాపై దాడి చేయడం తాలిబన్ల చర్యలాంటిందన్నారు. రాష్ట్రం తాలిబన్లలా కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని నిప్పులు చెరిగారు. చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని ఆమె అన్నారు.