కాంగ్రెస్ పార్టీలోఉన్నన్ని విభేదాలు మరే పార్టీలో కూడా ఉండవేమోఅనిపిస్తుంది. ఎందుకంటు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం కేవలం కాంగ్రెస్‌లోనే మనకు కనిపిస్తుంది. ఇకపోతే ఇప్పుడు రేవంత్ విషయంలో ఈ వ్యాఖ్యలు మరింత ఎక్కువయ్యాయి. ఆయన ఇలాంటి అసంతృప్త నేతలకు చెక్ పెట్టేందుకు ఎన్ని ప్లాన్లు వేస్తున్నా కూడా అవి పెద్దగా సక్సెస్ కావట్లేదని తెలుస్తోంది. దీంతో ఆయన సీనియర్ల నోర్లు మూయించేందుకు కాంగ్రెస్ వ్యవహారాల కమిటీని కూడా నియమించేలా చూశారు.
ఇక ఈ కమిటీలో మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రద్రర్స్, అసంతృప్తిలో ఉన్న మరికొందరు సీనియర్లకు చోటు దక్కింది. టీపీసీసీ కొత్త కార్యవర్గం నియమించిన చాలా కొద్దిరోజులకే ఇలా మరో టీంను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు.ఈ కమిటీ విషయంలో ఎంతో ఆచితూచి మరీ రేవంత్‌పై అసంతృప్తంగా ఉన్న వారికే చోటు దక్కేలా చూశారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక సైలెంట్‌గా ఉంటారని అంతా అనుకున్నారు.
అనుకున్నట్టుగానే కొద్దిరోజులుగా సైలెంట్ గా కనిపిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి తన వైఖరి బయటపెట్టారు. కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి మొన్న సైదాబాద్ లో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారని తెలుసుకున్న కోమటిరెడ్డి ఆయనకంటే ముందే వెళ్లి పరామర్శించారు. ఇక ఆయన వెళ్లిన తర్వాత రేవంత్ వచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో వారి మధ్య ఉన్న సన్నిహిత్యం ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది. అంటే ఇప్పట్లో కోమటిరెడ్డి అలక వీడేలా లేరని తెలుస్తోంది.