కేసీఆర్ సర్కార్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. మీరు సృష్టిస్తున్న సంపద.. చేసిన అప్పుల వడ్డీలకే సరిపోవడం లేదని మండిపడ్డారు. ఎనిమిదేండ్లలో 4.50లక్షల కోట్ల అప్పులు చేసినా.. ఒకటో తారీఖు జీతాల్లేవ్. ఏ పథకానికీ నిధుల్లేవ్ అంటూ విమర్శల అస్త్రాలను వదలారు వైఎస్ షర్మిల.
సంపద సృష్టించడం అంటే మీరు చేసిన అప్పులకు రూ.లక్ష కోట్ల వడ్డీ కట్టడమా? కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల కమీషన్లు దోచుకోవడమా? అని నిలదీశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం మీ వంతు, తెచ్చిన అప్పులు కట్టడం జనాల వంతన్నారు.
దీన్నే అంటారు మీ భాషలో సంపద సృష్టించడం.సొంత నియోజకవర్గంలో ఫుడ్ పాయిజన్ తో పిల్లలు ప్రాణ సంకటంలో పడితే.. ఈయన మాత్రం పక్క నియోజకవర్గాల్లో సుద్ధులు చెప్తుండు.మాటలు చెప్పడంలో పెద్ద దొరకు మించిపోయిండు చిన్నదొర అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు వైఎస్ షర్మిల.