ఆరు నెలల్లో ఎన్నికలు..రేవంత్ ఫెయిల్..బీజేపీకే పట్టం.!

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. అసలు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఇంకా సమయం ఉండగానే..ప్రతిపక్షాలు పికప్ అవ్వని సమయం చూసుకుని..ముందస్తుకు వెళ్ళి సక్సెస్ అయ్యి, రెండోసారి అధికారంలోకి వచ్చారు.

దీంతో ప్రతిపక్షాలు అలెర్ట్ గా ఉంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలే ముందస్తు ఎన్నికలు జరగనున్నాయని ప్రచారం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ మాత్రం ముందస్తు లేదని చెబుతుంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదురుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ బాగా దూకుడుగా ఉంది. ప్రతి అసెంబ్లీ స్థానంలో బలపడేలా ముందుకెళుతుంది.

బూత్ లెవెల్‌లో కార్యకర్తలని సమకూర్చుకుంటున్నారు. ఇదే సమయంలో తాజాగా బీజేపీ..119 స్థానాల్లోని బూత్ లెవెల్ నాయకులతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ సైతం బూత్ లెవెల్ నుంచే నాయకుడుగా ఎదిగారని, వారే బీజేపీ గెలుపుకి మూలస్థంబాలు అంటూ బండి సంజయ్ అంటున్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని, ఎప్పుడు ఎన్నికలోచ్చిన బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్‌పై బండి కామెంట్స్ చేశారు. ఎప్పుడో 12 మంది ఎమ్మెల్యేలు మారితే..ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇదంతా ఒక డ్రామా అని, ఆ 12 మంది ఎమ్మెల్యేకు ఎక్కడికో వెళ్లారో అధ్యక్షుడుకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఫెయిల్ అయిందని అన్నారు…రాబోయేది బీజేపీ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వడం లేదు..ముందస్తుకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారితే లేదు.

Read more RELATED
Recommended to you

Latest news