వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈనెల 21 నుండి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో పర్యటిస్తారు. కడెం ప్రాజెక్టు ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పోచయ్య గూడెం పోడు రైతుల తో మాట్లాడతారు. 22వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్ ల పరిశీలనతో పాటు వరద బాధితులను కలిసి పరామర్శించనున్నారు.
23వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా..వైఎస్ షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు.” 18 ఏళ్ల కింద వైయస్సార్ గారు కట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ చెక్కుచెదరకుండా పని చేస్తుంటే, లక్షల కోట్లు అప్పు తెచ్చి మరీ కెసిఆర్ కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు లోని కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్ లు పట్టుమని రెండేళ్లు కూడా కాకుండానే మునిగి పోయాయి. సమర్ధత గల నాయకుని పనితీరుకు నిదర్శనం వైయస్సార్ దేవాదుల, అనవసరమైన ఖర్చుకు, అవినీతికి నిదర్శనం కేసీఆర్ కాలేశ్వరం”. అంటూ ట్వీట్ చేశారు.