సీఎం జగన్‌ మాస్‌ లీడర్‌..యువతకు రోల్ మోడల్ – విజయమ్మ

-

సీఎం జగన్‌ మాస్‌ లీడర్‌..యువతకు రోల్ మోడల్ అని విజయమ్మ కొనియాడారు. వైసీపీ ప్లీనరీ సమావేశంలో వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ… మీ అందరి హృదయాల్లో రాజశేఖర్ రెడ్డి సజీవంగా ఉన్నారన్నారు. ప్రజల అభిమానం నుంచి వైసీపీ పార్టీ పుట్టిందని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని… పార్టీ అంటేనే ప్రజల అభిమానం అని వివరించారు.

జగన్ అనేక కష్టాలు ఎదుర్కొన్నారని… మా కుటుంబం అనేక నిందలు భరించిందని ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ. అధికారం కోసం అనేక పార్టీలు పుడతాయి… కానీ వైసీపీ మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం పుట్టిందని స్పష్టం చేశారు.

అన్యాయంగా కేసులు పెట్టి వేధించాలని… ఇలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. నా బిడ్డ నడిపించిన మీ అందరి పైన నా అనువణువునా కృతజ్ఞత ఉందన్నారు విజయమ్మ. ఈరోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నామని.. ఆనాడు అధికార శక్తులని జగన్ పై విరుచుకుపడ్డ బెదరలేదని గుర్తు చేశారు. కానీ కొంత మంది జగన్‌ పై విమర్శలు చేయడం దారుణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news