గ్రేటర్ లో దారుణమైన పోలింగ్ శాతం నమోదు అవుతోంది. ఇప్పుడు మూడు గంటల దాకా నమోదయిన పోలింగ్ శాతం చూస్తే 25.34 శాతం పోలింగ్ నమోదైంది. మూడు దాటుతున్నా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావడం లేదు. శివారు ప్రాంతాల్లో ఉత్సాహంగా వోట్ వేసేందుకు వోటర్లు ముందుకు వస్తున్నారు. చాలా కేంద్రాల్లో ఖాళీగా కూర్చున్నారు పోలింగ్ సిబ్బంది.
వోట్ వేసే విషయంలో దివ్యాంగులు, వృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ యువత తీరుపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారు కానీ.. ఓటేసేందుకు ముందుకు రారా? అంటూ కొందరు సీనియర్ సిటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఓటింగ్ 50 శాతం కూడా దాటుతుందా అంటే అనుమానంగానే ఉంది. ఇక గత ఎన్నికల్లో హైదరాబాద్ లో 46 శాతం పోలింగ్ నమోదయింది. ఒకవేళ పోలింగ్ శాతం పెరిగితే తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తే అసలుకే మోసం అనేలా ఇప్పుడు తగ్గిపోవడం గమనార్హం.