ఆదిరెడ్డి భ‌వానీ సైకిల్ దిగేస్తున్నారా… వైసీపీ వాళ్లు ఏమంటున్నారు…!

-

ఆదిరెడ్డి భవాని….రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే ఓ సంచలన విజయంతో దుమ్ములేపిన నాయకురాలు. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తెగా, సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు కోడలుగా రాజకీయాల్లోకి వచ్చిన భవాని… చంద్రబాబు సపోర్ట్‌తో తొలిసారి రాజమండ్రి సిటీ బరిలో దిగి అద్భుత విజయాన్ని సాధించారు. ఓ రేంజ్‌లో వైసీపీ వేవ్ ఉన్నా సరే భవాని దాదాపు 30 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భవాని…భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ సపోర్ట్‌తో నియోజకవర్గంలో దూసుకెళుతున్నారు. శ్రీనివాస్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు.

ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డారు. సొంత డబ్బులని ఖర్చు పెట్టి పేద ప్రజల అవసరాలు తీర్చారు. ప్రస్తుతం గోదావరి వరదల నేపథ్యంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై, రాజధాని అమరావతికి మద్ధతుగా మాట్లాడుతున్నారు. అయితే టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న ఆదిరెడ్డి ఫ్యామిలీ పార్టీని వీడనుందని ప్రచారం జరుగుతోంది.

ఆదిరెడ్డి భవాని, తన భర్త  ఆదిరెడ్డి వాసు రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీని వీడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అటు భవాని మామ ఆదిరెడ్డి అప్పారావు ఇదివరకు వైసీపీలోనే ఉండొచ్చారు. అందులో ఎమ్మెల్సీ అయ్యే టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చాకే ఆదిరెడ్డి ఫ్యామిలీ బాగా ఫేమస్ అయింది. భవానిని ఎమ్మెల్యేగా గెలిచాక వారికి మరింత ఫాలోయింగ్ వచ్చింది. పైగా ఎర్రన్నాయుడు కుమార్తె కావడంతో రాష్ట్రంలోని టీడీపీ కేడర్ భవానినీ ఎక్కువ అభిమానిస్తారు.

ఇక ఆదిరెడ్డి ఫ్యామిలీ కొద్ది రోజులుగా బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. ఇక వైసీపీ కూడా రాజ‌మండ్రిలో ఆదిరెడ్డి ఫ్యామిలీ త‌మ పార్టీలోకి వ‌స్తే పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని భావిస్తున్నా కూడా గ‌తంలో ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీ ఇచ్చినా పార్టీ వీడ‌డంపై జ‌గ‌న్ గుర్రుగా ఉన్నార‌ట‌. ఇక ఆదిరెడ్డి ఫ్యామిలీ నిర్ణ‌యం ఎలా ఉన్నా భ‌వానీ మాత్రం రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడుల జోక్యం లేకుండా ముందుకెళ్లడం కూడా కష్టమే అని తెలుస్తోంది. ఏదేమైనా ప్ర‌స్తుతం రాజ‌మండ్రిలో ఆదిరెడ్డి ఫ్యామిలీ పార్టీ జంప్ విష‌య‌మే హాట్ టాపిక్‌గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news