మున‌ప‌టి చంద్ర‌బాబు ఎక్క‌డికెళ్లారో..!

-

‘చంద్రబాబు మునుపటిలా లేరు. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఎక్కువ అసహనానికి గురవుతున్నారు’. ఈ మాటలు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుని చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. గతంలో పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తే అప్పటి అధికార పక్షం సమాధానాలు చెప్పేందుకు కష్టపడేది. కానీ 2019 ఎన్నికల ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన స్పీచులు పేలవంగా ఉండటంతో పాటు ఆయన ఏం మాట్లాడినా…వైసీపీ నుంచి తొలిసారి గెలిచిన జూనియర్ ఎమ్మెల్యేలు సైతం ఆయనపై సెటైర్లు వేసేస్తున్నారు.

రాజకీయాల్లో చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రధాన మంత్రులని డిసైడ్ చేశారు. ఇవన్ని ఒక్కప్పుడు చంద్రబాబు చేసినవే. అయితే 2014 అధికారంలో వచ్చాక ఆయనలో మార్పు మొదలైంది. అంతకముందు సీఎంగా ఎలా ఉన్నారో అలా లేరు. అప్పటిలో మాటలు తక్కువ చెప్పి, పనులు ఎక్కువ చేసేవాళ్ళు. కానీ 2014 తర్వాత మాటలు ఎక్కువ…మేటర్ తక్కువైపోయింది. ఇలా చేయడం వల్లే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

సరే ప్రతిపక్ష నాయకుడుగా సత్తా చాటుతారు అనుకుంటే అలా జరగడం లేదు. ఆయనలో అంతకముందు ఉన్న చాణిక్యం, మాటకారితనం, వ్యూహాలు అన్నీ పోయాయి. ఏదో పైకి గట్టిగా మాట్లాడుతున్నారుగానీ లోపలంతా డొల్లగానే ఉంది. పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతున్న…పార్టీని పైకి లేపే స్టామినా చంద్రబాబుకు లేకుండా పోయింది. పార్టీ కంటే కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించే ఎక్కువ ఆలోచన పెట్టడంతో చంద్రబాబు వాల్యూ తగ్గుతూ వస్తుంది. అందుకే పార్టీ వీడేవారు సైతం చంద్రబాబు పని అయిపోయిందనే చెబుతున్నారు.

అటు టీడీపీ నుంచి వెళ్ళి వైసీపీలో మంత్రులైన వారు సైతం చంద్రబాబుని నోరు మెదపనివ్వడం లేదు. ఇక అసెంబ్లీలో అయితే చంద్రబాబు పరిస్తితి ఘోరతిఘోరంగా ఉంది. అన్నీ వైపుల నుంచి ఆయనని వైసీపీ ఎమ్మెల్యేలు ర్యాగింగ్ చేసేస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఓర్పు కోల్పోయి ఎక్కువ అసహనానికి గురవుతున్నారు. మొత్తం మీద ఆయన విలువ రోజురోజుకూ పడిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తన విలువ ఎలా పెంచుకుంటారో…పార్టీని ఎలా నిలబెడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news