వైసీపీలో కమ్మని షాకులు..రిస్కే..!

-

వైసీపీలో రెడ్లు, టీడీపీ కమ్మ వర్గం నేతల హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. అలా అని వైసీపీలో కమ్మ, టీడీపీలో రెడ్డి నేతలు లేరని కాదు. వైసీపీలో కమ్మ నేతలు బాగానే ఉన్నారు..టీడీపీలో రెడ్డి నేతలు ఉన్నారు. అయితే అధికార వైసీపీలోని కమ్మ నేతలు గురించి మాట్లాడుకుంటే..ఆ పార్టీలో చాలామంది కమ్మ నేతలు ఉన్నారు. కాకపోతే కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారే ఎక్కువ హైలైట్ అవుతారు.

ఎందుకంటే పార్టీలో కొడాలికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది..కొడాలికి ఉన్న ప్రాధాన్యత వైసీపీలో మరో కమ్మ నేతకు ఉండదు. అందుకే పెద్దగా వైసీపీలో కమ్మ నేతలు హైలైట్ అవ్వరు. అయితే ఇప్పటివరకు వైసీపీలో కమ్మ నేతలకు పెద్దగా ఇబ్బందులు వచ్చినట్లు కనిపించలేదు. ప్రాధాన్యత లేకపోయినా..వారికి పార్టీలో ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో కొందరు కమ్మ నేతలకు వైసీపీ షాక్ ఇచ్చేలా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాస్త కమ్మ నేతలకు సీట్లు బాగానే ఇచ్చినా సరే..ఈ సారి మాత్రం హ్యాండ్ ఇచ్చేలా ఉంది.

వైసీపీలో కమ్మ నేతలు కష్టపడి పనిచేస్తున్న సరే వారికి సీటు గ్యారెంటీ ఇవ్వడం లేదు. అలాగే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు గ్యారెంటీ కనిపించడం లేదు. పర్చూరులో వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న రావి రామనాథంబాబు బాగా కష్టపడుతున్నారు. గడపగడపకు కార్యక్రమలో ఆయనే నెంబర్ 1. కానీ ఆయనకు సీటు గ్యారెంటీ లేదు. అటు అద్దంకిలో బాచిన కృష్ణచైతన్య కూడా బాగా పనిచేస్తున్నారు. అయినా సరే ఈయనకు సీటు డౌటే.

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు నెక్స్ట్ సీటు వస్తుందో లేదో తెలియడం లేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ది అదే పరిస్తితి. ఇక పార్టీలో మొదట నుంచి పనిచేస్తున్న పొన్నూరు నేత రావి వెంకటరమణని తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అక్కడ ఎమ్మెల్యే రోశయ్యతో విభేదాలు ఉండటమే కారణం. ఇటు చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌కు ఏ పదవి ఇవ్వలేదు..ప్రాధాన్యత కూడా లేదు. పైగా ఇక్కడ మంత్రి విడదల రజిని…మర్రి వర్గాన్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. మొత్తానికి వైసీపీలో కమ్మ నేతలకు షాకులు తగిలేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news