Telangana : మూడేళ్ల తర్వాత తొలిసారిగా జీరో కొవిడ్ కేసులు

-

తెలంగాణలో మూడేళ్ల తర్వాత జీరో కొవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్‌ కేసులు మూడేళ్ల కిందట తొలిసారిగా నమోదు కాగా.. అప్పటినుంచి ఇప్పటివరకూ స్వల్ప సంఖ్యలోనైనా నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం(27న) 3,690 నమూనాలను పరీక్షించగా.. ఒక్కకేసు కూడా నమోదు కాలేదు.

రాష్ట్రంలో 2020 మార్చి 2న తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో గరిష్ఠంగా ఒక్కరోజులో 10 వేలకు పైగా కేసులు నిర్ధారణ కాగా.. కనిష్ఠంగా 2 కేసులు నమోదయ్యాయి. గత నవంబరులో గరిష్ఠంగా 77.. కనిష్ఠంగా 2, డిసెంబరులో గరిష్ఠం 16.. కనిష్ఠం 5, జనవరిలో గరిష్ఠం 15.. కనిష్ఠంగా శుక్రవారం సున్నా కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news