ఇది ప్రజా విజయం…కేసీఆర్

-


తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెరాస విజయాన్ని ప్రజా విజయంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవనలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. ఈ విజయం పూర్తిగా ప్రజా విజయమేనన్నారు.. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు.. కులాలు, మతాలకతీతంగా నిండుగా దీవించి తమకు ఈ విజయాన్ని అందించారన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు యావత్‌ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశానికి దిక్చూచిలా వ్యవహరించనుందన్నారు . జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తామన్నారు. తాను ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పినట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. ‘‘తెరాస కార్యకర్తలు, నాయకులు శ్రేణులందరూ అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే గొప్ప విజయం సాధించాం.

తొలి నుంచి అనుకున్నట్టుగానే అణుకువ, వినయం, విధేయత అవసరం. విజయంతో గర్వం, అహంకారం రావాల్సిన అవసరం లేదు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్న..తెచ్చుకున్న తెలంగాణని నిర్మించుకునే విధంగా పాలన సాగించాం… ప్రజలు మా పాలనను దీవించారు.. కొత్త రాష్ట్రాన్ని ఓ బాటలో పెట్టాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. కోటి ఎకరాలు పచ్చబడాలనే లక్ష్యంలో ఏమాత్రం రాజీలేదు. అది జరిగి తీరాల్సిందే. తెరాసను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనీశ్వరం అని ఎన్నికల ప్రచార సభల్లో అన్నాను. తెలంగాణ ప్రజలకు ఏది కావాలో అది తప్పక అందిస్తాను.. దేశ రాజకీయాల్లో భాగంగా ఏపీలోనూ తమ పార్టీ ప్రభావం చూపిస్తామని తెలిపారు.
నాన్ కాంగ్రెస్…నాన్ భాజపా..
రాష్ట్రాలు పాలించుకునే టప్పుడు కేంద్ర ప్రభుత్వం పెత్తనం సరైందికాదు.. నాటి ప్రభుత్వాలు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశాయి… త్వరలోనే నాన్ కాంగ్రెస్,… నాన్ భాజపా వేదికగా పార్టీలను ఏకం చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు పరిపక్వతతో ఆలోచించాలి… ఈ యుగంలోనూ కుళ్లు, కుతంత్రాలకు చెందిన రాజకీయాలు చాలా విడ్డూరం. త్వరలోనే కేంద్ర రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news