ఈ ట్రైన్‌ ఐదు గంటలకు 46 కి.మీ మాత్రమే వెళ్తుందట.. మధ్యలో ప్రకృతి అందాలు వీర లెవల్‌

-

జనరల్‌గానే ట్రైన్‌ జర్నీ అంటే స్లోగా సాఫీగా సాగిపోతుంది.. కానీ ఎంత స్లోగా వెళ్లినా యావ్రేజ్‌గా గంటకు 75 కిలీమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. కానీ ఈ ట్రైన్‌ మాత్రం ఐదు గంటలకు కేవలం 46 కి. మీ వేగంతో వెళ్తుందట.. తాబేలు కంటే స్లోగా ఉంది కదూ..!భారతదేశంలోని అత్యంత నెమ్మెదైన రైలుగా నిలించింది. ఇంతకీ ఆ ట్రైన్‌ ఏంటి.? ఎందుకంత స్లోగా వెళ్తుందంటారా..?
ఊటీ మెట్టుపాళయం నీలగిరి ప్యాసింజర్ రైలు భారతదేశంలోనే అత్యంత నెమ్మదైన రైలుగా ప్రసిద్ధి చెందింది. ఇది గంటకు 10 కి.మీ వేగంతో మాత్రమే నడుస్తుంది. ప్రభుత్వ వెబ్‌సైట్ ఇన్వెస్ట్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఇది భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు కంటే దాదాపు 16 రెట్లు నెమ్మదిగా ఉందట.. ఈ రైలు దాదాపు ఐదు గంటల్లో 46 కి.మీ వేగంతో ఇది కొండ ప్రాంతంలో ప్రయాణిస్తుంది.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కనిపించే సుందరమైన దృశ్యం రైలు ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుందట. ఈ రైలును ఐక్యరాజ్యసమితి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. యునెస్కో వెబ్‌సైట్ ప్రకారం… నీలగిరి కొండల గుండా ఈ రైలుమార్గం నిర్మాణం మొదట 1854లో ప్రతిపాదించబడింది. అయితే కొండ ప్రాంతం కావడంతో 1891లో పనులు ప్రారంభించి 1908లో పూర్తి చేశారు.
మార్గ మధ్యంలో వంద వంతనెలు..
ఈ రైలు 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100 వంతెనలు దాటుతుంది. ఆ సమయంలో రైల్వే స్కేలింగ్ అత్యాధునిక సాంకేతికతకు ప్రాతినిధ్యం వహిస్తుందని, రైలు 326 మీటర్ల నుండి 2,203 మీటర్ల వరకు ఉండేదని యునెస్కో తెలిపింది. IRCTC ప్రకారం… రైలు దాని 46 కి.మీ ప్రయాణంలో అనేక సొరంగాలు, 100 వంతెనల గుండా వెళుతుంది. రాతి భూభాగం, లోయలు, తేయాకు తోటలు, దట్టమైన అడవులతో కూడిన కొండలు ఈ రైలు ప్రయాణాన్ని అందంగా చేస్తాయి. కేవలం ఈ జర్నీ ఎంజాయ్‌ చేయడానికే చాలామంది ఈ రైలులో ప్రయాణిస్తారట..
ఈ అత్యంత అద్భుతమైన దృశ్యం మెట్టుపాళయం నుండి కూనూర్ వరకు రైలు మార్గంలో నడుస్తుంది. ఇక్కడ కనిపించే ప్రధాన స్టేషన్లలో నీలగిరి మౌంటైన్ రైల్వే మెట్టుపాళయం నుంచి ఊటీకి రోజువారీ సేవలను అందిస్తుంది. ఈ రైలు మెట్టుపాళయంలో ఉదయం 7.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఊటీ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాళయం చేరుకుంటుందని IRCTC తెలిపింది. ఈ మార్గంలోని ప్రధాన స్టేషన్లు కూనూర్, వెల్లింగ్టన్, అరవంకాడు, కెట్టి, లవ్‌డేల్.
రైలులో ఫస్ట్‌క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ సీట్లు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ సీట్లు సెకండ్ క్లాస్‌తో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉండే కుషన్‌లను కలిగి ఉంటాయి. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2016లో రైలుకు నాల్గవ కోచ్ అటాచ్‌ చేశారు..సెలవులు, వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందస్తు బుకింగ్‌ చేసుకోవాలి..
ధరల వివరాలు..

Read more RELATED
Recommended to you

Latest news