ఈ మధ్యకాలం లో ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రమే చూస్తున్నారు. అందుకోసం ఒక్కొక్కరు వివిధ రకాల పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా చక్కెర మంచిది కాదని చాలా మంది చక్కెరని దూరం పెట్టేశారు. మీరు కూడా షుగర్ మంచిది కాదని షుగర్ ని తినడం మానేశారా..? అయితే కచ్చితంగా ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి పంచదారని మానేస్తే ఎలాంటి ఇబ్బందులు తప్పవు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.
డిప్రెషన్:
షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదని షుగర్ ని మానేస్తే డిప్రెషన్ కి గురయ్యే ప్రమాదం వుంది. మెదడు పని చేయడంలో కీలక పాత్ర పోషించే న్యూరో ట్రాన్స్మిటర్ వలన ఏకాగ్రత లోపిస్తుంది.
ఆందోళన పెరుగుతుంది:
ఒక్కసారిగా షుగర్ తీసుకోవడం మానేస్తే ఆందోళన కూడా బాగా పెరుగుతుంది.
వికారం, వాంతులు:
ఒక్కసారిగా షుగర్ ని మానేయడం వలన వికారం వాంతులు తో పాటుగా జీర్ణ సమస్యలను ఎదుర్కోవాలి.
తలనొప్పి:
చక్కెర తీసుకోకపోవడం వలన తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సడన్ గా షుగర్ ని మానేయద్దు. కనీసం షుగర్ కి బదులుగా మరేదైనా తీసుకోండి. లేదంటే కొద్దిగా షుగర్ ని తీసుకుంటూ ఉండండి.
చికాకు పెరుగుతుంది:
షుగర్ ని ఒక్కసారిగా తీసుకోవడం మానేస్తే చికాకు పెరుగుతుంది.
నిద్రలేమి సమస్య:
షుగర్ ని వదిలేయడం వలన నిద్రలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఈ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.