వీడియో : నాయిన కేసిఆర్.. నాయినా అని పిల‌వాల‌నుంది పిల‌వ‌నా నాయినా..!

-

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్… కరోనా కట్టడికి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతీ ఒక్కరు సమర్ధిస్తూ వస్తున్నారు. కేసీఆర్ ని తీవ్రంగా వ్యతిరేకించే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ప్రసంగాలకు, నిర్ణయాలకు, ఆయన ఆదేశాలకు, ఆలోచనలకు, అడుగులకు, వ్యూహాలకు, సూచనలకు, సమీక్షలకు, సమావేశాలకు, హెచ్చరికలకు, ధైర్యానికి ఇలా ఏది చూసినా సరే కేసీఆర్ నుంచి తెలంగాణా సమాజం ఏది ఆశించిందో అది ఇప్పుడు దొరికింది.

మొదటి కేసు నుంచి ఇప్పుడు ఉన్న కేసుల వరకు ప్రతీ ఒక్కటి కూడా కేసీఆర్ ఎక్కడా కూడా ధైర్యం కోల్పోలేదు. ప్రతీ ఒక్కటి కూడా ప్రజలకు ధైర్యం చెప్తూ ఆయన పాలన కొనసాగిస్తున్నారు. రైతులకు ఆయన ఇస్తున్న ధైర్యం, ప్రజలకు ఆయన చేస్తున్న సూచనలు, తెలంగాణా సమాజానికి ఇంట్లో మనిషిగానే అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆయనను రాజకీయంగా ఎంతో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆయన నిర్ణయాలు చూసి విమర్శలు మానేశారు.

తాజాగా సినీ నటుడు ఉత్తేజ్ కేసీఆర్ గురించి ఒక వీడియో చేసారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా తన వాయిస్ తో వీడియోని రూపొందించారు. ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే ప్రతీ ఒక్కటి కూడా ఆ వీడియో లో ఉత్తేజ్ స్పష్టంగా అందమైన పదాలతో వివరించడం విశేషం. కేసీఆర్ ని నాయనా అంటూ పోల్చారు. ఆసలు ఉత్తేజ్ ఏమన్నారు అనేది చూద్దాం…

మొన్న టీవీల నిన్ను

సూసినంక.. నీ మాటలిన్నంక,

నీ చెయ్యితోని మా కండ్లనీళ్ళు తుడ్శినట్టు

మా భుజంమ్మీద చెయ్యేసి

ధైర్యం చెప్పినట్టు,

మా ఇంట్ల మనిషివైనట్టుగొట్టింది…

నిన్ను ‘నాయినా’ అని పిలవాలనుంది…!

పిలవనా… నాయినా..?

మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు,

ఆల్లు ఈల్లని కాదు మొత్తం అందరు

ఊపిరి పీల్సుకున్నరు,

పానాలు లేచివచ్చినయ్‌ అన్నరు

తెలంగాణ వెన్నుపూసగ నిల్శినవ్‌

గుండె దమ్మువై నడుస్తున్నవ్‌

మా బాగోగులు పట్టించుకుంటున్నవ్‌

నిన్ను చూసినా… నీ మాటలిన్నా,

బతుకుమీద నమ్మకమొస్తది,,

భయమన్నది ఆమడదూరం పోతది…!

దేన్నయినా జయిస్తమనిపిస్తది…

మేం చేసుకున్న అదృష్టం నువ్వు…

ఇది నా ఒక్కడి మాట కాదు…

ఒక్క తెలంగాణ మాట కాదు…

తెలుగోళ్లందరి మాట,

అందరు సల్లగుండాలె,

మనుషులు పోతే వస్తరా అని…

మానవ వనరుల విలువలు చెప్తివి…

తెలంగాణ బిడ్డలే గాదు,

ఈ గడ్డమీదున్న ఏ బిడ్డ గూడ…

ఉపాసం పండొద్దని…

అమ్మలెక్కన అర్సుకుంటున్నవ్‌…

ఆఫీసర్లకి ఆర్డర్లిస్తివి

ఆపన్నుల ఆదుకుంటివి

అనాథల అక్కున చేర్చుకుంటివి

గీ ‘కరోనా’ని తరుముకుంట

పానాలు నిలుపుతుంటివి..!

ప్రధాన మంత్రంటే

దేశానికి బడిలెక్కన

మంచిమాట ఎవరన్నా వినాలని

మంచి బాట ఎవరుచూపినా నడవాలని

ప్రమాదంల పార్టీలు చూడొద్దని

మానవత్వం నేర్పిస్తివి

మానవజన్మ పునరుద్ధరిస్తుంటివి

ఇరుగుపొరుగోల్లకు ఆదర్శమైతివి,

మొన్నమొన్ననే నాయె

తెలంగాణ లేశి నిలబడింది

దూపకు అంగలార్శిన మట్టి పెల్లలకు

దూప తీరిస్తివి.. పంట బిడ్డల్ని పెంచబడ్తివి

ఎవరింట్లనో బతికే బతుకులకు

తెలంగాణ ఇల్లు గడితివి

చీకటి బతుకులల్ల దీపాలెలిగిస్తివి

మంచిగ వున్న టైమ్‌ల

తెలంగాణ పచ్చగ విరబూస్తున్న టైమ్‌ల

ఏడికెల్లి వచ్చెనో రాకాసిలెక్క

దయ్యం లెక్కన.. దరిద్రం లెక్కన..

ఈ కరోనా పాడుగాను

కనపడకుంటనే ఊపిరి తియ్యబట్టె

మనసుల అరిగోస పెట్టబట్టె

మనుషుల దూరం చెయ్యవట్టె,

భయం.. బాధ..

ఎప్పటికి బాగయితమో

కల్సిమెల్సి ఎప్పుడు తిర్గుతమో, అని

గాబర గాబర అయితున్న టైమ్‌ల

టీవీల నువ్వొచ్చి

మనాది పడకుండ్రని

మాట్లాడినవ్‌ సూడు… గప్పుడు,

ఏ…. ఏంగాదు, నాయినున్నడు

నాయిన సూసుకుంటడు అన్పించి

నేనో ముద్దతిని… పోరగాండ్లకో

రెండు ముద్దలుపెట్టిన

తల్లి గాసం లెక్కన నువ్వుండనే వుంటివి,

నాయినా..

గప్పుడెప్పుడో ఎన్కట

గోవర్ధన పర్వతమెత్తి

శ్రీకృష్ణ పరమాత్ముడు రాళ్ల వర్షాన్నించి

గోకులాన్ని కాపాడినట్టు

గిప్పుడు నువ్వు కూడా

కరోనా బారిన పడకుంట, నీ భుజం కాసి

ఈ గడ్డమీదోళ్లు ఓటర్లు కాదు

మనుషులని చెప్పి కాపాడబడ్తివి

అది కథేమో గని, ఇదైతే నిజం..!

ఆకలి దెల్సినోనివి

అప్పుల బాధలు తెల్సినోనివి

మడమ తిప్పక యుద్ధం చేసేటోడివి

తెలంగాణ తల్లి నుదుట

తొలి తిలకం దిద్దినోనివి

అన్నం పెట్టే రైతన్నకు అన్నవైతివి

పేదోళ్ల పరమాన్నవైతివి

దేవుడిచ్చిన బహుమానం నువ్వు,

ఆపతుల వున్నం..

బయటికి రాకుర్రి, పరేషాను కాకుర్రి

పరేషాన్‌ చేయకుండ్రి..

అన్నవ్‌, గంతనే గద…

మమ్మల్నేమన్న జైల్లో పెట్నవ?

మాకేమన్న శిక్షలేస్తున్నవ?

అరే.. పప్పు, ఉప్పు దొరికే

దుకాన్లు తెరిపిస్తివి

కూరగాయలు దొరుకుతనే వుండే

పాలు పెరుగు వస్తనే వుండె

పేదోళ్లకు రేషన్‌ ఇస్తనే వుంటివి

పంటలు కొంటనని

ప్రభుత్వ దుకాన్లు తెరవనేబడ్తివి

ఇంకేం కావాల్ననాయిన..

నువ్వు చెప్పినట్టు పానం మిగిల్తే చాలు

నువ్వు చెప్పినట్టింటమ్‌

కలో గంజో తాగుతం

పోరగాండ్లకు సమ్జాయిస్తమ్‌

అల్పం గాండ్లకు మేమే బుద్ధిచెప్తమ్‌

రేపటి కలివిడి కోసం

ఈరోజు అలగ్‌ అలగ్‌ వుంటం,

ప్రాణం అడ్డం పెట్టి పానం పోస్తున్న

డాక్టర్లకు.. బయటికొచ్చి బరువుకాం

ఎండలల్ల మాడ్తున్న పోలీసులకు

గుండెనిండ దండం బెడ్తున్నం

నాయినా! నువ్వు చెప్పినట్టు

పానాలు తీస్క రానీకి

గిప్పుడైతే సావిత్రమ్మలు లేరు గని..

పానాలు పోకుండ సూస్కోనీకి

డాక్టర్లు, పోలీసులు, ప్రభుత్వమోల్లు

మీదిమిక్కిలి నువ్వు..

సావిత్రమ్మలెక్కనే కొడ్తున్నరు..!

నీ ముందు సూపునకు

గీ ‘కరోనా’ ఓ లెఖ్ఖనా.. నాయినా…

నువ్వు ముందుంటే చాలు

మాస్కుల కవచమేస్కొని

కరోన మీద యుద్ధం చేస్తం

దూరంగుంటం.. మనసుల దగ్గరికైతం

నీ నీడల సల్లగ బతుకుతం

తెలంగాణని బతికిచ్చికుంటం..!

నాయినా..

ఆపదలో ఆదుకున్నోడే మనిషి

కరోనా కనపడని పురుగైతే

నవ్వు కనపడే దేవుని తీర్న..

గీ కరోనా పురుగు ఎట్లనన్న సస్తది

మళ్లీ రేపటి రోజున సిద్ధంగుండాలె

Read more RELATED
Recommended to you

Latest news