జూన్ 12 రాశిఫలాలు : గణేష నామస్మరణతో ఈరాశులకు ఆర్థిక లాభం!

మేషరాశి : బిజీగా ఉంటారు, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, రెండోభాగంలో వినోదాన్నికార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక ఆలోచన, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది, భాగస్వామితో ఆనందం.
పరిహారాలు: గణేష చాలీసా పారాయణంతో మీ ఆర్థిక ఇబ్బందులు పోతాయి.

వృషభరాశి : ఓర్పుతో విజయం, రియల్ ఎస్టేట్ కలసివస్తుంది, కుటుంబంలో సంతోషం, సలహాలు వినండి, వస్తువులు జాగ్రత్త, భాగస్వామితో ఆనందం. పనిచేసే చోట అభివృద్ధి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తే చాలు మంచిది.

మిథునరాశి : మేధాశక్తితో విజయం, సానుకూలమైన ఆలోచనలు, బంధువుల సహాయం, ఉద్యోగంలో మార్పు, ప్రయాణాలు అంతగా కలసిరావు, ఒత్తిడి, భాగస్వామితో సంతోషకరమైన రోజు, ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయం జాగ్రత్త.
పరిహారాలు: బాబాదేవాలయ దర్శనం, ప్రదక్షణలు మంచిచేస్తుంది.

June 12th Wednesday daily Horoscope

కర్కాటకరాశి : భద్రతపట్ల దృష్టి పెట్టండి, ఆశలు నెరవేరుతాయి, అదృష్టం కలసివస్తుంది, గతంలో కష్టపడినదానికి ప్రతిఫలం వస్తుంది. పనిచేసేచోట తెలివితేటలు, లౌక్యాన్ని వాడాలి, భాగస్వామితో మనస్పర్థలు.
పరిహారాలు: గురువులను గౌరవించండి, బాబా దేవాలయం లేదా రావిచెట్టు ప్రదక్షణలు చేయండి.

సింహరాశి : అనారోగ్యం, దీని గురించి ఆలోచించకుండా ఏదైనా వ్యాపకాన్ని కల్పించుకోండి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ప్రేమ సానుకూల పవనాలు వీస్తాయి, భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి, భాగస్వామితో అత్యంత అనుకూల వాతావరణం ఆనందం.
పరిహారాలు: నవగ్రహాల ప్రదక్షణ మీకు మంచి చేస్తుంది.

కన్యారాశి : మీ నమ్మకం, శక్తి ఈ రోజు బాగా ఎక్కువ ఉంటాయి, ఆర్థికలబ్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, శుభకార్యాలు, శాస్ర్తోక్తమైన పూజలు చేస్తారు, భాగస్వామితో ప్రతికూల వాతావరణం.
పరిహారాలు: ఎరుపు పూలతో నవగ్రహాలకు ప్రదక్షణలు చేసి అక్కడ పెట్టి రండి అంతా మంచి జరుగుతుంది

తులారాశి : మీ దయాస్వభావం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఆర్థికంగా ఇబ్బంది, కుటుంబ జీవితం కోసం తగిన సమయాన్ని కేటాయించాల్సిన రోజు, వృత్తిలో అనుకూలత. మంచి ఆలోచనలతో లబ్ది పొందుతారు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేస్తే చాలు.

వృశ్చికరాశి : మీరు అనుకున్నవి చేయడానికి మంచిరోజు, ప్రయాణం, ఖర్చు, అవకాశాలు బొలెడు, స్వీట్ హార్ట్‌తో ప్రవర్తించాల్సిన రోజు, వృత్తిపరమైన అభివృద్ధి, భాగస్వామితో దురుసు ప్రవర్తన-జాగ్రత్త.
పరిహారాలు: గణేష చాలీసా పారాయణం లేదా ఓం నమో గణేశాయనమః అనే నామాన్ని 21 సార్లు పఠించండి.

ధనస్సురాశి : అతివిచారం, ఒత్తిడి, ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది, స్నేహితుల కలయిక, పాత సంబంధాలు మెరుగుపర్చుకోండి, వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది.
పరిహారాలు: గణేష చాలీసా లేదా నామాన్ని పఠించండి మేలు జరుగుతుంది.

మకరరాశి : ఆశావహ దృక్పథం వైపు పయనించండి, మీలో విశ్వాసం మిముల్ని కాపాడుతుంది, ఈర్ష్య, అసూయలకు దూరంగా ఉండండి, భాగస్వామ వ్యాపారానికి ఈ రోజు దూరంగా ఉండండి, సీనియర్ల నుంచి సహకారం, కుటుంబ సంతోషం, వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గణేష నామస్మరణ మిముల్ని ప్రగతిపథాన నడిపిస్తుంది.

కుంభరాశి : ఆహారాన్ని తీసుకోవడం నియంత్రణ పాటించండి, వ్యాయమం చేయండి, ఆర్థిక పరిస్థితి పుంజుకొంటుంది, ఖర్చులు పెరుగుతాయి, పెళ్లి కానివారికి సంబంధాలు చూడాల్సిన సమయం, వృత్తిలో సానుకూలత, గౌరవం. వివాహితులకు సాధారణంగా ఉంటుంది.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర పసుపు, ఎరుపు పూలతో ప్రదక్షణలు చేయండి.

మీనరాశి : ఒత్తిడి, ఆతృత వల్ల అనారోగ్యం, ఆర్థికలాభాలు, కుటుంబంలో సంతోషం, ప్రేమ విషయాలు సాధారణం, వృత్తిలో జాగ్రత్తగా ఉండాలి, మీ వలన హాని పొందినవారికి క్షమాపణలు చెప్పాలి. ప్రయాణాలు. పనులు పూర్తి.
పరిహారాలు: విష్ణు సంబంధ దేవాలయ సందర్శన / నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తే మంచి జరగుతుంది.

– కేశవ