ఏపీ సీఎం జగన్ తో ముగిసిన రోజా భేటీ.. మీడియాతో రోజా ఏమన్నారంటే?

-

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిశాను తప్పితే మంత్రి పదవో.. మరేదో పదవి ఆశించి కాదు. గత తొమ్మిదేళ్ల నుంచి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని… ఈ రాష్ట్రానికి రాజన్న పాలన తీసుకురావాలన్న లక్ష్యంతోనే పనిచేశాం.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ సాయంత్రం అమరావతిలో మీట్ అయ్యారు. నిజానికి.. గత కొన్ని రోజులుగా రోజా మంత్రి పదవికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ పోస్టులు వచ్చి పడుతున్నాయి. దీంతో ఏపీలో రోజా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆమెకు మంత్రి పదవి ఇవ్వనందున ఆమె అలిగారని.. అందుకే.. ఆమెను బజ్జగించేందుకు, నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు జగన్ ఆమెకు ఇవాళ అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిసింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రోజాకు ఫోన్ చేసి ఇవాళ సాయంత్రం సీఎం జగన్ ను కలవాల్సిందిగా తెలిపారు. దీంతో రోజా.. హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకొని ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో రోజా మాట్లాడారు.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిశాను తప్పితే మంత్రి పదవో.. మరేదో పదవి ఆశించి కాదు. గత తొమ్మిదేళ్ల నుంచి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని… ఈ రాష్ట్రానికి రాజన్న పాలన తీసుకురావాలన్న లక్ష్యంతోనే పనిచేశాం. మాకు ఆ ఆలోచన తప్పితే మరో ఆలోచన లేదు. పదవుల కోసం మాత్రం ఎప్పుడూ పని చేయలేదు.

మంత్రి పదవి రాకపోవడంపై నాకు అసంతృప్తి అస్సలు లేదు. అలగడాలు, బుజ్జగింపులు అంటూ ఏమీ ఉండవు. మీడియానే కావాలని తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తోంది. చాలామంది నా అభిమానులు ఆ వార్తలు చూసి నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే… మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని వేడుకుంటున్నా. జగన్ ముఖ్యమంత్రి అయ్యారంటే.. అందరం ముఖ్యమంత్రులం అయినట్టే. జగన్ పాలనలో మా నియోజకవర్గాల్లో.. మా ప్రజలకు నవరత్నాలు అందించాలి. వాళ్లు కష్టాలు దూరం చేయాలి. ఆ ఆలోచన తప్పితే మరోటి లేదు మాకు.. అని రోజా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news