మార్చి 18 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

శ్రీరామ మార్చి- 18- గురువారం- పాల్గుణమాసం.

మేషరాశి:శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు  చేస్తారు.
పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

todays horoscope

వృషభరాశి:ఇబ్బందులు ఎదురవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలు  అనుకూలించవు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. అనవసర విషయాలు చర్చించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని వత్తిడి పెరుగుతుంది.
పరిహారాలుః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మిధున రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయడంవల్ల మంచి ఫలితాలు వస్తాయి.

 

కర్కాటక రాశి:అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సఖ్యతగా ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో  మంచి ర్యాంకులు పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారం పొందుతారు. మిత్ర లాభం పొందుతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి:ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. నోటి మాట జారడం వల్ల ఎదుటి వారితో ఇబ్బందులు ఏర్పడతాయి. గర్భిణీలు అప్రమత్తంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువు విషయంలో ఆ శ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.
పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి

కన్యారాశి:అనవసర ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందక ఇబ్బందులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సోదర సోదరీమణులతో విభేదాలు కలుగుతాయి. పిల్లల విషయంలో అనవసర ఖర్చులు అధికమవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేక వాయిదా పడతాయి. ప్రశాంతత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.

పరిహారాలుః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

తులారాశి:అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు.  వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. సోదరులతో కలిసి మెలిసి సఖ్యత గా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి:రుణ బాధలు తీరిపోతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. ఎదుటి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి . స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి:పనిభారం పెరుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉండదు. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తుల కు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. మీలో అహంకార భావం ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. చిన్న చిన్న విషయాల గురించి వాదోపవాదాలు, విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. చిన్నచిన్న ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

మకరరాశి:ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. సోదర సోదరీమణులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయలేరు. వాయిదా పడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. రుణ బాధలు పెరుగుతాయి. మొండి బకాయిలు వసూలు కావు, ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.
పరిహారాలుః ఈరోజు సంకష్టహర గణపతిని ఆరాధించండి.

కుంభరాశి:కార్యసిద్ధి పొందుతారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. గతంలో బాకీలను తిరిగి వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. స్నేహితులతో, అయినవారితో కలిసిమెలిసి సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తుల కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు లాభాన్ని కలిగిస్తుంది.
పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి:ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతోంది. ప్రశాంతత కోల్పోతారు.
పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 21 ప్రదక్షణాలు చేయండి.