మే 12న కొంత మందికి మాత్రం అనుకొని ధనలాభం, శుభవార్తలు వింటారు.మరి వారి రోజువారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము.. ముందుగా..
మేషం:
ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది.వృత్తి, ఉద్యొగాలలో మంచి శుభవార్తలను వింటారు.
వృషభం:
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యొగాల లో మంచి ఫలితాలను అందుకుంటారు.ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి..ఈరోజు అనుకూలమైన రోజు..
మిథునం:
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు పనిచెయ్యదు.మీరు బాగా ఆలొచించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది.ఉద్యొగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది..
కర్కాటకం:
బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి.దగ్గర బంధువుల నుంచి గుడ్ న్యూస్ లను వింటారు.విందు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహం:
ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు.బంధువుల తో చికాకులు,శుభవార్త లు వింటారు.పనిలో ఒత్తిడి పెరుగుతుంది..
కన్య:
సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన లాభం వస్తుంది .ఉద్యొగాలలో భారం తగ్గుతుంది.. అధికారుల సహకారం ఉంటుంది.మంచి రోజు..
తుల:
కుటుంబ సభ్యులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది..ఆదాయం బాగున్నా కూడా అంతకు మించి ఖర్చులు కూడా ఉంటాయి. ఉద్యొగాలలో గుడ్ న్యూస్ లు వింటారు.
వృశ్చికం:
వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను దాటుకొని లాభాలను అందుకుంటారు. కొన్ని రాష్ట్రాలలో సన్నిహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు.వ్యాపారాలు లాభిస్తాయి.
ధనస్సు:
బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి..కొత్తగా వ్యాపారాలు చేయటం మంచిది కాదు.కుటుంబ సభ్యులతో మాటలు పడవలసి వస్తుంది.
మకరం:
దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి ఆకస్మిక ధన లాభం ఉన్నది. బంధు మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు..ఇంట్లో శుభకార్యాలు,కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యొగాలలో పని ఒత్తిడి..అనుకున్న మంచి ఫలితాలు అందవు.
కుంభం:
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు లాభిస్తాయి.పిల్లల విషయం పై దృష్టి పెట్టాలి.
మీనం:
చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు నుండి సోదరుల సహాయంతో బయటపడతారు.ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బాకాయిలు పూర్తీ అవుతాయి.ఉద్యోగాలలో మంచి ఫలితాలు కలుగుతాయి.