Fact Check: చంద్ర‌యాన్‌-2 నిజంగానే ఫొటోల‌ను తీసిందా..?

-

సోష‌ల్ మీడియా ప్ర‌స్తుతం ఎలా త‌యారైందంటే… అందులో వ‌స్తున్న వార్త‌ల‌ను అస్స‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. కొంద‌రు కావాల‌నే ప‌నిగ‌ట్టుకుని మ‌రీ అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు.

సోష‌ల్ మీడియా ప్ర‌స్తుతం ఎలా త‌యారైందంటే… అందులో వ‌స్తున్న వార్త‌ల‌ను అస్స‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. కొంద‌రు కావాల‌నే ప‌నిగ‌ట్టుకుని మ‌రీ అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. నిజంగా నిజ‌మ‌ని భ్ర‌మించేలా వారు అస‌త్య వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో చాలా మంది అవి నిజ‌మే అని న‌మ్మి బోల్తా ప‌డుతున్నారు. తాజాగా ఇస్రో పంపిన చంద్ర‌యాన్‌-2 గురించి కూడా కొన్ని న‌కిలీ వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

పైన ఇచ్చిన ఫొటోలు చూశారు క‌దా.. అవును.. అవి గ‌త రెండు, మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మొన్నీ మ‌ధ్యే చంద్ర‌యాన్‌-2ను ఇస్రో ప్ర‌యోగించింది క‌దా.. ఆ ప‌రిక‌రం తీసిన ఫొటోలే అవి.. అని చెప్పి కొంద‌రు వాటిని సోష‌ల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. చంద్ర‌యాన్-2 నింగి నుంచి తీసిన ఫొటోలివ‌ని చెప్పి వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిని నిజ‌మైన ఫొటోల‌ని చాలా మంది నమ్మారు. కానీ ఇవి.. నిజ‌మైన‌వి కావ‌ని.. న‌కిలీవని తేలింది. ఎలా అంటే…

did chandrayaan 2 really took photos

చంద్రయాన్‌- 2ను ప్ర‌యోగించిన‌ప్ప‌టి నుంచి ఇస్రో ఎలాంటి ఫొటోల‌ను బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌లేదు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తాజాగా చంద్ర‌యాన్‌-2 ఉన్న ద‌శ గురించి ఇస్రో ట్వీట్ చేసింది. అంతేకానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు పైన ఇచ్చిన విధంగా ఎలాంటి ఫొటోనూ ఇస్రో బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌లేదు. అయితే కొంద‌రు మాత్రం నిజంగానే చంద్ర‌యాన్-2 తీసిన ఫొటోలివ‌ని చెప్పి.. పై ఫొటోల‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్సాప్‌ల‌లో పంపుతున్నారు. క‌నుక‌.. సోష‌ల్ మీడియా ప‌ట్ల ఎవ‌రైనా స‌రే.. కొంత జాగ్ర‌త్త‌గా ఉండ‌డ‌మే బెట‌ర్‌.. అందులో వ‌చ్చే ఏ వార్త‌నూ మ‌నం అంత సుల‌భంగా న‌మ్మ‌కూడ‌ద‌ని… మ‌రోసారి రుజువైంది..!

Read more RELATED
Recommended to you

Latest news