అంతరిక్ష ప్రయాణంలో కొత్త శకం.. స్పేస్ ఎక్స్ సాధించిన ఘనత

-

అంతరిక్ష ప్రయాణం అంటే అది సాధ్యమయ్యేది కాదన్న భావన అందరిలోనూ ఉండేది. దానికోసం ప్రత్యేక శిక్షణ, ప్రభుత్వ సహాయం అవసరం అని చెప్పుకునేవారు. కానీ, ఇకపై అదంతా చరిత్రే. అంతరిక్ష ప్రయాణం ఇక అందరి సొంతం కాబోతుంది. అంతరిక్షంలో సామాన్యులు సైతం ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు చాలా కంపెనీలు అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందులో అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ ఒకటి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ కి చెందిన ఈ కంపెనీ అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపింది.

ప్రైవేటు కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడంతో అంతరిక్ష ప్రయాణంలో కొత్త శకం ప్రారంభమైంది. ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో మూడు రోజులు ప్రయాణం చేస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను దాటి, ఈ ప్రయాణం సాగుతుంది. భూమి ఉపరితలం నుండి 357మైళ్ళ దూరంలో అంటే సుమారు 575కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news