5జి సేవ‌ల‌ను అందించేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన ఎయిర్‌టెల్‌..

-

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ దేశంలోని వినియోగ‌దారుల‌కు 5జి సేవ‌ల‌ను అందించేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే 5జి సేవ‌ల‌ను ఎయిర్‌టెల్ హైదరాబాద్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించింది. 1800 మెగాహెడ్జ్‌తోపాటు 2100, 2300 మెగాహెడ్జ్‌ల‌లో ఈ సేవ‌ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

airtel says it is ready to give 5g services

కాగా ఎయిర్‌టెల్ 5జీ సేవ‌ల‌ను ప‌రీక్షించేందుకు గాను ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రొ, ఒప్పో రెనో 5 ప్రొ ఫోన్ల‌ను ఉప‌యోగించింది. ఈ క్ర‌మంలోనే ఎలాంటి హార్డ్‌వేర్‌ను మార్చాల్సిన ప‌నిలేకుండా కేవ‌లం సింపుల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా 5జి సేవ‌ల‌ను అందించేందుకు తాము సిద్ధ‌మ‌ని ఎయిర్‌టెల్ తెలియ‌జేసింది.

అయితే 5జి సేవ‌ల‌కు గాను ఎయిర్‌టెల్‌కు ఇంకా అనుమ‌తులు ల‌భించాల్సి ఉంది. దీంతో అతి త్వ‌ర‌లోనే ఎయిర్‌టెల్ ఈ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తుంద‌ని తెలుస్తోంది. ఇక జియో కూడా ఈ ఏడాది జూన్ వ‌ర‌కు 5జిని అందిస్తామ‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించింది. దీంతో ఈ రెండు సంస్థ‌లో ఏది ముందుగా 5జి సేవ‌ల‌ను అందిస్తుంది ? అన్న విష‌యం ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news