ఫేస్​బుక్​లో కొత్త బగ్.. ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఆటోమెటిక్​గా ఫ్రెండ్ రిక్వెస్ట్..!

-

ప్రముఖ సోషల్ మీడియా నెటవర్కింగ్ యాప్ ఫేస్​బుక్​లో మరో సెక్యూరిటీ బగ్ తలెత్తింది. యూజర్లు ఎవరిదైనా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఆటోమెటిక్​గా వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోతోంది. ఈ లోపాన్ని స్వయంగా గుర్తించిన ఫేస్​బుక్.. దీనిపై వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఇటీవలి అప్​డేట్​లో ఈ లోపం ఏర్పడినట్లు తెలిపింది.

గత వారం యూజర్లు ఓపెన్ చేసిన ప్రతి ప్రొఫైల్​కు ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోయింది. దీనిపై అనేక మంది సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో మెటా రెస్పాండ్ అయింది. వెంటనే సమస్యను గుర్తించి చర్యలు చేపట్టింది.  యాప్ అప్​డేట్ తర్వాత ఈ సెక్యూరిటీ లోపం తలెత్తినట్లు వెల్లడించింది. సమస్యను పరిష్కరించినట్లు స్పష్టం చేసింది.

 

“ఇటీవలి యాప్ అప్​డేట్​లో బగ్ గుర్తించాం. దీని వల్ల పొరపాటున ఫ్రెండ్ రిక్వెస్ట్​లు వెళ్లాయి. దీంతో కొంతమంది యూజర్లకు ఇబ్బందులు తలెత్తాయి. అందుకు క్షమాపణల కోరుతున్నాం. ఈ బగ్​ను సరిచేశాం.”
-మెటా ప్రతినిధి

Read more RELATED
Recommended to you

Latest news