బ్యాక్టీరియా తాకని స్మార్ట్ ఫోన్ ని తయారు చేసిన కంపెనీ.. సబ్బుతో కడగచ్చు కూడా..

-

టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచమే చేతుల్లోకి వచ్చాక ప్రతీ పనీ చాలా సులువైపోయింది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్.. మొదలగునవన్నీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాయి. ఐతే టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా, కరోనా వంటి మహమ్మారిని ఏమీ చేయలేకపోతున్నాం. కరోనా నుండి కాపాడుకోవడానికి చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం చేయమని చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడూ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ని ఎంత మంది శుభ్రపరుస్తున్నారనేదే ప్రశ్న.

మన చేతులకి సబ్బు పెట్టి కడిగినట్టు, స్మార్ట్ ఫోన్లని కడిగే అవకాశం ఉండదు. కానీ ఇకపై మనం స్మార్ట్ ఫోన్ ని కడగవచ్చు. అవును మీరి చదువుతున్నది నిజమే. ఫోన్ పై ఉన్న సూక్ష్మ జీవులని తొలగించడానికి మీ ఫోన్ ని సబ్బుతో కడగవచ్చు. సబ్బుపెట్టి శుభ్రంగా టాప్ వాటర్ తో క్లీన్ చేయవచ్చు. యూకే కి చెందిన స్టార్టప్, ఇలాంటి స్మార్ట్ ఫోన్ ని రూపొందించింది. ఎస్42 పేరుగల ఈ స్మార్ట్ ఫోన్ డస్ట్ రెసిస్టెంట్ గా, వాటర్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. కావాలంటే మీరు శానిటైజ్ చేసుకోవచ్చు కూడా.

2021లో లాంఛ్ కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ని అదనంగా ఒక పొర కప్పబడి ఉంటుంది. ఈ కొత్త సాంకేతికతని బయోమాస్టర్ ఆంటిమైక్రోబియల్ టెక్నాలజీ అని పిలుస్తున్నారు. దీనివల్ల దుమ్ము, ధూళి, అందులో ఉండే సూక్ష్మ జీవులు ఫోన్ పై ఎక్కువ సేపు నిలవవు. ఈ బయోమాస్టర్ టెక్నాలజీ వల్ల సూక్ష్మ జీవులు చనిపోకపోయినా, 15నిమిషాల్లో ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియాని 85శాతం తగ్గిస్తుంది. 24గంటల్లో 99.9శాతం తగ్గిస్తుందట. ఈ స్మార్ట్ ఫోన్ ని సబ్బుతో గానీ, సానిటైజర్ తో గానీ, బ్లీచింగ్ పౌడర్ తో గానీ శుభ్రంగా కడగవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news