BREAKING : టాటా కంపెనీ చేతికి ఐఫోన్ తయారీ కాంట్రాక్టు…

-

ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ లకు ఉన్న ఆదరణ గురించి వేరే చెప్పల్సిన పనిలేదు. ప్రతి అయిదు మందిలో ఒకరికి ఐఫోన్ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఒకప్పుడు ఐఫోన్ తయారీ కేవలం విదేశాలకు పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడు ఇండియాలోనూ చాలా చోట్ల ఉత్పత్తి జరుగుతోంది. కాగా ఇప్పటి వరకు ఐఫోన్ లను తయారుచేసే అవకాశాన్ని కేవలం విస్ట్రోన్, ఫాక్స్ కాన్, పెగా ట్రాన్ కంపెనీ లు మాత్రమే ఉన్నాయి. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ లిస్ట్ లోకి టాటా కంపెనీ కూడా చేరింది. టాటా మరియు ఐఫోన్ యాజమాన్యాలు ఒక ఒప్పందం ప్రకారం భారత్ లో ఐఫోన్ లను తయారుచేయడానికి అంగీకరించింది.

కాగా ఇటీవల విస్ట్రోన్ ఉత్పత్తి కేంద్రాలను టాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనితో ఇప్పుడు ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్ లను టాటా కంపెనీ ఉత్పత్తి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news