డెల్ నుంచి ఇన్‌స్పిరాన్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. ఫీచ‌ర్లు, ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

-

ప్ర‌ముఖ కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీదారు డెల్.. ఇన్‌స్పిరాన్ సిరీస్ లో నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇన్‌స్పిరాన్ 13, 14, 15 ల్యాప్‌టాప్‌ల‌తోపాటు 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌ల‌ను కూడా డెల్ లాంచ్ చేసింది. వీటి ఫీచ‌ర్లు, ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

dell launched new laptops under inspiron series

కొత్త డెల్ ఇన్‌స్పిరాన్ 2 ఇన్ 1 సిరీస్ ల్యాప్‌టాప్‌ల‌లో ఏఎండీ, ఇంటెల్ ప్రాసెస‌ర్ ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు. 11వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ప్రాసెస‌ర్ లేదా ఏఎండీ రైజ‌న్ మొబైల్ ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. రేడియాన్ గ్రాఫిక్స్ ల‌భిస్తాయి. ఈ ల్యాప్‌టాప్ లలో 14 ఇంచుల డిస్‌ప్లే ల‌భిస్తుంది. వీటిని ల్యాప్‌టాప్‌, టెంట్‌, స్టాండ్‌, ట్యాబ్లెట్ మోడ‌ల్‌ల‌లో 4 విధాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఈ ల్యాప్‌టాప్‌ల‌ను రౌండ్ ఎడ్జ్‌ల‌తో రూపొందించారు. అద్భుత‌మైన మెటీరియ‌ల్‌తో వీటిని త‌యారు చేశారు. అందువ‌ల్ల స్మూత్‌, గ్లాస్ లైక్ ఫీలింగ్ వ‌స్తుంది. ఇన్‌స్పిరాన్ 13 ల్యాప్‌టాప్ కేవ‌లం 1.25 కిలోల బ‌రువును మాత్ర‌మే క‌లిగి ఉంటుంది. ఇందులో క్యూహెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇక ఇన్‌స్పిరాన్ 14, 15 ల్యాప్‌టాప్‌ల‌లో 11వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ హెచ్ గ్రేడ్ ప్రాసెస‌ర్‌లు ల‌భిస్తాయి. ఇన్‌స్పిరాన్ 15 మోడ‌ల్‌లో ఏఎండీ రైజ‌న్ 5000 సిరీస్ మొబైల్ ప్రాసెస‌ర్ ఆప్ష‌న్ కూడా ల‌భిస్తుంది. రేడియాన్ గ్రాఫిక్స్ ల‌భిస్తాయి. ఎన్‌వీడియా ఎంఎక్స్ 450 గ్రాఫిక్ కార్డులు కూడా ఆప్ష‌న్‌లో ల‌భిస్తాయి.

ఇన్‌స్పిరాన్ 14 (2 ఇన్ 1) ల్యాప్‌టాప్ ప్రారంభ ధ‌ర రూ.57,990 ఉండ‌గా, ఏఎండీ ప్రాసెస‌ర్ అయితే రూ.65,990 ప్రారంభ ధ‌ర ఉంటుంది. ఇక సాధార‌ణ ఇన్‌స్పిరాన్ 14 ల్యాప్‌టాప్ రూ.44,990 ప్రారంభ ధ‌ర‌కు ల‌భ్య‌మ‌వుతుండ‌గా, ఇన్‌స్పిరాన్ 15 ల్యాప్ టాప్ ప్రారంభ ధ‌ర రూ.48,990గా ఉంది. వీటిల్లో ఇంటెల్‌, ఏఎండీ ప్రాసెస‌ర్ ఆప్ష‌న్లు ల‌భిస్తాయి. జూన్ 22వ తేదీ నుంచి ఏఎండీ ప్రాసెస‌ర్ ఉన్న ల్యాప్‌టాప్ ల‌ను విక్ర‌యిస్తారు. జూలై 7 నుంచి ఇన్‌స్పిరాన్ 13 ల్యాప్‌టాప్ ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...