మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

-

చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లని వదిలేసి కొత్తవాటికి వెళ్తున్నారంటే దానికి కారణం అందులో బ్యాటరీ లైఫ్ అయిపోవడమే. బ్యాటరీ లైఫ్ తగ్గిపోయిన కారణంగా ఇక ఏమీ చేయలేక కొత్త ఫోన్లని తీసుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాటరీలని మార్చుకునే సౌకర్యం లేదు. ప్రతీ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ తీయడానికి వీలు లేకుండానే వస్తుంది. ఐతే ఇదంతా స్మార్ట్ ఫోన్ల కంపెనీ ట్రిక్ అనుకోవచ్చు. అది పక్కన పెడితే బ్యాటరీ లైఫ్ తొందరగా పాడవకుండా ఎక్కువ కాలం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా లిథియం ఐయాన్ బ్యాటరీలు కాలం 500సైకిల్స్ గా ఉంటుంది. అంటే సంవత్సరంన్నర కాలం వీటి లైఫ్ ఉంటుంది. అందుకే వీటిని వాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళినపుడు ఛార్జర్ కూడా తీసుకువెళ్ళండి. అంతేకానీ, అక్కడ ఉన్న వేరే మొబైల్ ఛార్జర్ తో ఛార్జ్ పెట్టవద్దు. ఎందుకంటే మీ బ్యాటరీకి సరిపడా వోల్టుల ఛార్జర్ అక్కడ ఉండకపోవచ్చు. దానివల్ల బ్యాటరీపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది.

అలాగే, ఎప్పుడైనా సరే వందశారం ఛార్జ్ చేయవద్దు. 85శాతం మాత్రమే చేయాలి. లిథియం బ్యాటరీలని వందశాతం ఛార్జ్ చేయడం వల్ల అవి ఉబ్బి పాడయ్యే అవకాశం ఉంది. ఇంకా, బ్యాటరీ పర్సెంటేజ్ 25శాతానికి తగ్గకముందే ఛార్జింగ్ చేయాలి. జీరో పర్సెంట్ వచ్చే వరకు వెయిట్ చేయడం సరికాదు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఎక్కువకాలం ఎక్కువ క్వాలిటీతో పనిచేస్తుంది. దానివల్ల మరీ తొందరగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కొవాల్సిన అవసరం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news