భాషా సంగం యాప్ తో అన్ని భాషలూ నేర్చుకోండి సింపుల్‌గా.. సర్టిఫికేట్ ఇంట్లో కుర్చోనే పొందండి ఈజీగా..!

-

చాలామందికి మల్టీ లాంగ్వేజెస్ నేర్చుకోవటం అంటే ఇష్టం ఉంటుంది. కానీ దానికోసం ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వెళ్లటం, క్లాసులు వినేంత టైం మాత్రం అందరి దగ్గరా ఉండదూ. మనం జాబ్ చేసే ఆఫీసులో ఎవరైనా వేరే స్టేట్ వాళ్లు ఉంటే..కాస్త ఇంట్రస్టె చూపిస్తాం కానీ..అదీ కొన్నిరోజులకే బోర్ కొట్టేస్తుంది. ప్రభుత్వమే..మనకోసం దేశప్రజలు అన్నీ భాషలు నేర్చుకోవాలని ఒక యాప్ ను రూపొందించింది. ఆ యాప్ పేరే..భాషా సంగం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్లోగన్ తో ఈ మొబైల్ యాప్ ను రూపొందించారు.

ఈ యాప్ పూర్తిగా ఉచితం అండీ… ఎవరైనా దీన్ని తమ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ భాషలను నేర్చేసుకోవచ్చు.. ఈ యాప్‌లో దేశంలోని 22 భాషలు ఉన్నాయి. వీటిని నేర్చుకోవచ్చు.. చదవవచ్చు. భాషా అభ్యాసానికి ఈ యాప్ లో ఆటలు ఉన్నాయి.. యాప్‌లో గేమ్స్ ప్లే చేయడం ద్వారా చాలా భాషలు సులభంగా నేర్చుకోవచ్చు.

ఈ యాప్ పూర్తిగా ఆన్‌లైన్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ అనే చెప్పాలి.. దీనిద్వారా మొబైల్ యూజర్ వివిధ భాషలను నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. 22 భాషల్లో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి, డోగ్రీ ఉన్నాయి. .

ఈ యాప్‌ను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఈ లింగ్విస్టిక్ మొబైల్ యాప్ ద్వారా రోజువారీ ప్రసంగం.. భాషలో ఉండే పదాలు.. వాక్యాలను నేర్చుకోవచ్చు. భాషతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం చూడవచ్చు. ‘భాషా సంగం’ మొబైల్ యాప్ కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే..

వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని, ప్రశ్నలు.. సమాధానాలు వ్యక్తిగతీకరించిన ప్రాతిపదికన రూపొందించారు.

వివిధ భాషలలో ఉన్న 500 సాంస్కృతిక చిట్కాలు ఇందులో ఉన్నాయి. ఇది మన సంస్కృతితో కనెక్ట్ అయ్యే ప్రయోజనాన్ని ఇస్తుంది.

భాషకు సంబంధించిన పదబంధాలను వినియోగదారు సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాల సహాయంతో భాషా పరిజ్ఞానం అందించారు.

ప్రతిరోజూ పురోగతిని తనిఖీ చేయడానికి రోజువారీ అభ్యాస వ్యవస్థ సృష్టించారు.

దేశంలోని విభిన్న సంస్కృతిని తెలుసుకోవడానికి..అర్థం చేసుకోవడానికి 44 ప్రత్యేక పాత్రలు సృష్టించారు.

ఈ లెసన్ యాప్ సులభంగా నేర్చుకోవడానికి గేమ్ లాగా రూపొందించారు.

ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చిన వెంటనే ఫీడ్‌బ్యాక్ వచ్చేలా వ్యవస్థ రూపొందించారు.

పురోగతి గురించి తెలుసుకోవడానికి ప్రతి పాఠం పూర్తయిన తర్వాత స్టార్ స్కోర్ ఉంటుంది.

అభ్యసం ఆధారంగా.. యూజర్ తన స్వంత పరీక్షను నిర్వహించవచ్చు. దాని ఆధారంగా ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్‌ను సాధించవచ్చు.

మీరు ఎంత నేర్చుకుని ఎంత పురోగతి సాధించారు అనే దాని ఆధారంగా పొందిన స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తుంది.

ఈ మొబైల్ యాప్‌ను దేశంలో ఒకే ఒక స్టార్టప్ మల్టీభాషలలో తయారు చేసింది. ఈ యాప్ యొక్క ఉద్దేశ్యం పిల్లలకు ముఖ్యంగా రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ భాషల గురించి సమాచారాన్ని అందించడమేనట. ఇంకెందుకు లేట్..మీరు ఒకసారి ఇన్ స్టాల్ చేసి చెక్ చేసేయండి. టైం ఉన్నప్పుడల్లా ఓపెన్ చేసి ఎంతోకొంత నేర్చుకోవచ్చు కదా.!

Read more RELATED
Recommended to you

Latest news