వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే మరో నయా ఫీచర్‌తో వాట్సాప్ మీ ముందుకు రానుంది. ఇంతకీ ఆ నయా ఫీచర్ ఏంటంటే.. ‘మెసేజ్ పిన్ డ్యూరేషన్’ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఒక చాట్‌లో లేదా గ్రూప్‌లో ఒక మెసేజ్‌ను పిన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం సహా, ఎంత సేపు పిన్ చేసి ఉంచుకోవాలో యూజర్లు నిర్ణయించుకోగలుగుతారు. దీని ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని హైలెట్ చేయడానికి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాచుకోవడానికి వీలవుతుంది.
వాట్సాప్ అభివృద్ధి చేస్తున్న ఈ నయా ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే, యూజర్లు వాట్సాప్ చాట్‌లో, గ్రూప్‌లో నిర్దిష్ట సమయం వరకు మెసేజ్‌ను పిన్ చేసుకోవచ్చు. ఆ సమయం తరువాత ఆటోమేటిక్‌గా ఆ మెసేజ్ అన్ పిన్ అయిపోతుంది. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, ఈ సరికొత్త ఫీచర్ ద్వారా పిన్ మెసేజ్ డ్యూరేషన్ 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వ్యవధి ఉండేలా వాట్సాప్ ఆప్షన్స్ ఇవ్వనుంది.