నెల్లూరులో 10కి 10..లోకేష్ ఎత్తులు..జగన్ దెబ్బ మళ్ళీ చూస్తారా?

-

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మకూరు, వెంకటగిరి స్థానాల్లో పూర్తి అయిన పాదయాత్ర సూళ్ళూరుపేటలో ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే నెల్లూరులో 10కి 10 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే..ఈ జిల్లాకు ఒరిగింది ఏమి లేదని, వైసీపీ ఎమ్మెల్యేలు నెల్లూరుని నాశనం చేశారని..ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని, ఒక్క కంపెనీ తీసుకురాలేదని, గతంలో టి‌డి‌పి హయాంలోనే అక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇక నెల్లూరులో టి‌డి‌పికి 10కి 10 సీట్లు ఇస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామని, వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పిని గెలిపించాలని ఆయన కోరారు. అయితే నెల్లూరులో టి‌డి‌పికి 10కి 10 సీట్లు రావడం సాధ్యమేనా? అంటే పూర్తిగా అసాధ్యం అని చెప్పవచ్చు. ఎట్టి పరిస్తితుల్లో టి‌డి‌పికి గెలిచే అవకాశాలు లేవు. 2014లోనే జిల్లాలో 10 సీట్లకు టి‌డి‌పికి 3, వైసీపీకి 7 సీట్లు వచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది.

ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీ పై చేయి సాధించే అవకాశాలు ఉన్నాయి..కాకపోతే గత ఎన్నికల మాదిరిగా స్వీప్ చేయడం కష్టమే..టి‌డి‌పి 2-3 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ లోకేష్ అన్నట్లు టి‌డి‌పికి కూడా 10కి 10 సీట్లు రావడం జరిగే పని కాదు. ఇప్పటికీ నెల్లూరుపై జగన్ కు గట్టి పట్టు ఉంది. ఆ జిల్లా ప్రజలు జగన్ పై అభిమానంతో ఉన్నారు.

పైగా అక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. రెడ్డి వర్గం వన్ సైడ్ గా వైసీపీ వైపే ఉంది. దీంతో నెల్లూరులో మళ్ళీ వైసీపీ హవానే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news