దేశీయ మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్ మరో నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ ఇన్1 పేరిట ఆ ఫోన్ విడుదలైంది. ఇందులో మీడియాటెక్ హీలియో జి80 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. రెండు వేరియెంట్లలో ఈ ఫోన్ లభిస్తోంది. ఈ ఫోన్‌కు వెనుక వైపు మూడు, ముందు వైపు ఒక కెమెరాలను ఏర్పాటు చేశారు.
మైక్రోమ్యాక్స్ ఇన్ 1 ఫీచర్లు…
* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 48, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఆండ్రాయిడ్ 11, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
మైక్రోమ్యాక్స్ ఇన్1 కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,499 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.11,999 గా ఉంది. మార్చి 26 నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఈ ఫోన్లను కొంటే వీటిని రూ.9,999, రూ.11,499 ధరలకే ఇస్తారు.