ఈ నెల 25న లాంచ్‌ కానున్న Infinix Note 12i .. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!!

ఇన్ఫినిక్స్ నుంచి త్వరలో కొత్త ఫోన్‌ లాంచ్‌ కానుంది. అదే Infinix Note 12i. ఈ నెల 25న ఈ ఫోన్‌ లాంచ్‌ చేయనున్నారు.. అయితే లాంచ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించిన కీలక సమాచారం అంతా లీక్‌ అయింది. ఫ్లిప్‌ కార్ట్‌లో ఫోన్‌కు సంబంధించిన వివరాలు ప్రత్యక్షమయ్యాయి.. ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి..

Infinix Note 12i స్పెసిఫికేషన్స్, ఫీచర్స్..

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 6.7-ఇంచ్ డిస్‌ప్లేతో వస్తుంది.
1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది.
Infinix Note 12i వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యింది.
ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తుండటంతో, యూజర్లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కంటెంట్‌ని బెటర్ రెజుల్యూషన్‌తో చూడవచ్చు.
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు.
గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ52 జీపీయూ వినియోగించారు.
ఇండియన్ వేరియంట్‌లో 4జీబీ ర్యామ్, 3జీబీ వర్చువల్ ర్యామ్‌ని అందించారు.
గ్లోబల్ మార్కెట్స్ లో 64జిబి స్టోరేజీ వేరియంట్ అందించారు.
ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Infinix Note 12i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు.
ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్ సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఈ ఫోన్ 7.8 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

కెమెరా క్వాలిటీ..

ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సర్, క్యూవీజీఏ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంటుంది.