లాంచ్‌కు రెడీ అయిన Google Pixel 7 సిరీస్‌.. లీకైన ఫీచర్స్‌

-

గూగుల్ కూడా తన కొత్త పిక్సెల్ 7 సిరీస్‌ను ఈ ఏడాది అక్టోబర్ లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే లాంచ్ తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, రిలీజ్ డేట్ లీక్ అయింది. లీకైన సమాచారం ప్రకారం..వివరాలు ఇలా ఉన్నాయి..
అలాగే, పిక్సెల్ 7 భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. పిక్సెల్ కంపెనీ చాలా కాలం క్రితమే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ లాంచ్ ఆపేసింది. పిక్సెల్ 4, పిక్సెల్ 5, పిక్సెల్ 6 సిరీస్ వంటి డివైజ్‌లు భారత మార్కెట్లో లాంచ్ కాలేదు. ఈ ఏడాది గూగుల్ తన నిర్ణయాన్ని మార్చుకోనే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో గూగుల్ పిక్సెల్ 7 లాంచ్ చేసే అవకాశం ఉంది.
Google Pixel 7 ఫీచర్లు (అంచనా) :
Pixel 7 సిరీస్ Google నెక్స్ట్ జనరేషన్ టెన్సర్ చిప్‌సెట్ ద్వార్వా పనిచేస్తుంది.
ఈ డివైజ్‌లు సరికొత్త ఆండ్రాయిడ్ 13 OS రానున్నాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
డివైజ్ మోడల్స్ ఎలా ఉంటాయనేది పెద్దగా తెలియకపోయినా.. గత ఏడాదిలో లాంచ్ అయిన మోడల్‌తో పోలిస్తే.. Pro Model అద్భుతమైన డిజైన్‌తో రానుందని లీక్ డేటా సూచించింది.
800నిట్స్ బ్రైట్‌నెస్ నుంచి 1,000నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌తో పెద్ద స్క్రీన్‌తో రానుంది.
ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ల్లో ఇప్పటికీ LTPO డిస్‌ప్లేతో పాటు HDR 10+కి సపోర్టుతో వస్తాయని అంటున్నారు.
Pixel 7 Pro సున్నితమైన స్క్రోలింగ్ కోసం 120Hz స్క్రీన్‌తో రావచ్చు.
ప్యానెల్ బహుశా QHD+ రిజల్యూషన్‌తో రానుంది.
ఇక ఫోటోగ్రఫీ కోసం.. Pixel 7 సిరీస్ 11-MP Samsung 3J1 సెన్సార్‌ను ఉపయోగిస్తోంది.
ఈ సెన్సార్ డ్యూయల్-పిక్సెల్ ఆటోఫోకస్ (DPAF) సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
రాబోయే పిక్సెల్ ఫోన్‌లతో కొన్ని పోర్ట్రెయిట్ షాట్‌లను పొందవచ్చు.
ఫోన్ వెనుక భాగంలో Samsung GN1 సెన్సార్, Sony IMX381 అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉండవచ్చు.
ప్రీమియం ఫోన్‌లు బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్‌ప్లే సెన్సార్‌ని అందిస్తున్నాయి.
ఈ డివైజ్ పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక లాంచ్ అయ్యేవరకు ఆగాల్సిందే.
ఈ ఏడాది ప్రారంభంలో Google I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో, సాఫ్ట్‌వేర్ దిగ్గజం Pixel 7, Pixel 7 Pro స్మార్ట్‌ఫోన్లను ధృవీకరించింది. కానీ లాంచ్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ, ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫోన్ అక్టోబర్ 6న ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వస్తుందని, అక్టోబర్ 13న సేల్ ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ కొత్త పిక్సెల్ 7 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news