యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ప్రొడెక్ట్స్‌కు మార్కెట్‌లో క్రేజ్ మాములుగా ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 14ను లాంచ్ చేసేందుకు యాపిల్ ఏర్పాట్లు చేస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌లపై కంపెనీ డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్(Flip Kart) ఐఫోన్ 13 సిరీస్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఆఫర్ ఎలా ఉందో చూడండి..
128GB స్టోరేజ్‌తో వచ్చే బేస్ ఐఫోన్ 13 మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.73,909 ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు ఇతర స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ హ్యాండ్‌సెట్‌పై మరో రూ.19,000 వరకు ధర తగ్గుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో లభించే అదనపు తగ్గింపు తర్వాత 128GB వేరియంట్ ఐఫోన్ 13 ధర రూ.54,909కి తగ్గుతుంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గుతుందట..
ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అనే నాలుగు హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. టాప్-ఆఫ్-ది-లైన్ A15 బయోనిక్ చిప్‌సెట్, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో ఐఫోన్ 13 బెస్ట్ పర్పార్మెన్స్ అందిస్తుంది. ఐఫోన్ 13 డ్యుయల్ 12MP రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 4K డాల్బీ విజన్ HDRలో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా నైట్ మోడ్ సహా 12MP TrueDepth సెన్సార్స్ కెపాసిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 17 గంటల వరకు వీడియోలను ప్లే చేయగలదు.
Iphone 14 స్పెసిఫికేషన్ అంచనా..
ఐఫోన్ 14లో 6.1-అంగుళాల డిస్ప్లే స్క్రీన్, ఐఫోన్ 14 ప్రో మోడల్‌లో 6.1-అంగుళాలు ఉంటుది.
ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.7-అంగుళాలు, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే స్క్రీన్ ఉండొచ్చు.
అయితే పెరిగిన కాంపోనెంట్ ఖర్చులు, నాన్-ప్రో వేరియంట్‌లను వేరు చేయడం, ఇతర కారణాలతో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ప్రీమియం ఫోన్ బ్రాండ్ ప్రో వేరియంట్‌లలో కొత్త డిజైన్‌తో వస్తుంది.
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో కెమెరా కెపాసిటీని అప్‌గ్రేడ్ చేయనుంది.
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ పెద్ద ప్రొఫైల్, మెరుగైన కెమెరా సెటప్‌తో వస్తాయని నివేదికల ద్వారా తెలుస్తోంది.
యాపిల్ ఐఫోన్ 14 వేరియంట్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 8GB RAM ఉండవచ్చు.
అయితే ఐఫోన్ 13 మోడల్ 8GB RAMతో, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.
ఐఫోన్ 14 సిరీస్ 64GB స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉండవచ్చని అంచనా.