ఈ నెల 14న లాంచ్ కానున్న iQoo Z6 Lite 5G.. 

-

ఐకూ నుంచి జెడ్‌ సిరీస్‌లో భాగంగా జెడ్‌6 5జీ ఫోన్‌ ఈ నెల 14న ఇండియాలో లాంచ్‌ కానుంది. లాంచ్‌కు ముందే కొన్ని స్పెసిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. లీకుల ఆధారంగా ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రో సైట్ కూడా అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యక్షం అయింది. ఇందులో ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉంది. పేరు తెలియని క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఇందులో ఉండనుంది. దీని స్పెసిఫికేషన్లను కంపెనీ సెప్టెంబర్ 8వ తేదీన రివీల్ చేయనున్నట్లు సమాచారం..
దీనికి ‘ఫుల్లీ లోడెడ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అని ట్యాగ్‌ను కూడా ఇచ్చారు. ఐకూ జెడ్6 లైట్ 5జీ మైక్రోసైట్ అమెజాన్‌లో కనిపించింది. సెప్టెంబర్ 14న ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్ తేదీ మినహా మిగతా వివరాలేవీ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. డ్యూయల్ 5జీ ఎక్స్‌పీరియన్స్ అని ఐకూ తన మైక్రో సైట్‌లో పేర్కొంది. అంటే దీన్ని బట్టి రెండు సిమ్ స్లాట్‌ల్లోనూ 5జీ వేయవచ్చన్న మాట.
 ఫోన్‌కు సంబంధించిన రెండర్లను బట్టి చూస్తే ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. ముందువైపు వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఉంది. సెల్ఫీ కెమెరాను అందులో అందించనున్నారు. ఈ ఫోన్ మనదేశంలో ఎంత ధరలో లాంచ్ అవుతుందో ఇంకా తెలియలేదు.
ఇటీవలే ఐకూ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అదే ఐకూ యూ5ఈ. ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా అంచే సుమారు రూ.16,000గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (సుమారు రూ.18,000) ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news