బీఏసీ సమావేశానికి బిజెపిని పిలవరా? – రఘునందన్ రావు

-

బీఏసీ సమావేశానికి బిజెపిని పిలవకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి తరఫున రాజాసింగ్ ఒక్కరే ఉన్నప్పుడు బీఏసీ సమావేశాలకు పిలిచారని.. కానీ ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీఏసీ సమావేశానికి పిలవడం లేదని మండిపడ్డారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కో రోజు మాట్లాడి అసెంబ్లీ సమావేశాలను ముగిద్దాం అనుకుంటున్నారని ఆరోపించారు. ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు రఘునందన్ రావు.

మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 6, 12, 13 తేదీల్లో మాత్రమే సమావేశాలు అని నోటీసులు పంపారని చెప్పారు. చరిత్రలో ఎప్పుడు ఇంత తక్కువ సమావేశాలు జరగలేదన్నారు. బిఎసిని సంప్రదించకుండా సమావేశాలను మూడు రోజులకే పరిమితం చేశారనిరని మండిపడ్డారు. కెసిఆర్ అహంకారానికి ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. శాసనసభ్యులను గడ్డి పోచల్లాగా అవమానిస్తున్నారని మండిపడ్డారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news