చైనాలో లాంచ్‌ అయిన iQOO Z6x 5G.. ధర తక్కువే..!

-

ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. అదే ఐకూ జెడ్6ఎక్స్ స్మార్ట్ ఫోన్. దీని ధర రూ. 20వేల లోపే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఐకూ జెడ్6ఎక్స్ ధర..
ఇందులో మూడు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లుగా అంటే సుమారు రూ.14,000గా నిర్ణయించారు.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగానూ అంటే సుమారు రూ.16,500గా నిర్ణయించారు.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగానూ అంటే సుమారు రూ.19,000గా ఉంది.
బ్లూ ఐస్, బ్లాక్ మిర్రర్, బ్లేజింగ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐకూ జెడ్6ఎక్స్ స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది.
స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2408 పిక్సెల్స్‌గా ఉండటం విశేషం.
మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.
ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news