త్వరలో ఇండియాలో లాంచ్‌ కానున్న Oppo Reno 8Z స్మార్ట్‌ ఫోన్‌..!

-

ఒప్పో తన కొత్త ఫోన్‌ను థాయ్‌ల్యాండ్‌లో లాంచ్‌ చేసింది. అదే Oppo Reno 8Z స్మార్ట్‌ ఫోన్‌. దీని ధర ఇండియన్‌ మార్కెట్లో సుమారు రూ.30 వేల లోపే ఉంటుంది. ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరీ ఫోన్‌ విశేషాలేలా ఉన్నాయంటే..!!
ఒప్పో రెనో 8జెడ్ ధర..
దీని ధరను 12,990 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా (సుమారు రూ.28,600) నిర్ణయించారు.
ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది.
డాన్‌లైట్ గోల్డ్, స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 8జెడ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080×2400 పిక్సెల్స్‌గా ఉంది.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.
 ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 5 జీబీ పెంచుకోవచ్చు.
అలాగే మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనో షూటర్, 2 మెగాపిక్సెల్ బొకే మాక్రో షూటర్లు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news