రియల్ మీ ప్యాడ్ మినీ ట్యాబ్లట్ టీజర్ అవుట్… స్పెసిఫికేషన్ మొదలైన వివరాలివే..!

-

రియల్‌మి ఇండియాలో స్మార్ట్‌ఫోన్లతో పాటుగా లాప్ టాప్ మరియు టాబ్లెట్స్ వంటి వాటిని కూడా అందిస్తోంది. అయితే ఈ కంపెనీ త్వరలోనే దేశం లో రియల్‌మి ప్యాడ్ మిని పేరు తో మరొక బడ్జెట్ టాబ్లెట్‌ను విడుదల చేయనున్నది. దీనికి సంబంధించి టీజర్ ని తీసుకు రావడం జరిగింది. మరి ఇక పూర్తి వివరాలను చూస్తే.. రియల్‌మి ప్యాడ్ మిని ట్యాబ్ మెగా బ్యాటరీ తో వస్తోంది.

- Advertisement -

 

ఈ రియల్‌మీ ప్యాడ్ మినీ టాబ్లెట్ ఇప్పటికే దీనిని ఫిలిప్పీన్స్‌లో కంపెనీ విడుదల చేసింది. ఇక దీని ఫీచర్స్ గురించి చూస్తే.. ఇది 1,340×800 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో మరియు 84:59 స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 8.7-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4 GB RAM మరియు 64 GB వరకు UFS 2.1 స్టోరేజ్ తో ఇది వస్తోంది.

అలానే Mali-G57 MP1 GPUతో Unisoc T616 సిస్టమ్-ఆన్-చిప్ ని కలిగి వుంది. ఈ రియల్‌మి ప్యాడ్ మిని ట్యాబ్ మైక్రో SD కార్డ్‌ స్లాట్ ని ఉపయోగించి మెమొరీని 1TB వరకు విస్తరించవచ్చు. ఇది రియల్‌మి UI మరియు ఆండ్రాయిడ్ 11తో రన్ అవుతుంది.

ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 6,400mAh పెద్ద బ్యాటరీతో వస్తోంది. 5-మెగాపిక్సెల్ కెమెరా మరియు వెనుకభాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను ఈ ట్యాబ్ కలిగి వుంది. ఇది 4G మరియు WiFiని కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లు మరియు మైక్రోఫోన్ ఫీచర్స్ కూడా ఇందులో వున్నాయి. ఈ ట్యాబ్ ని ఏప్రిల్ 29న లాంచ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...