లాంచ్‌ అయిన Nokia C 21 Plus స్మార్ట్‌ ఫోన్..! ధర బడ్జెట్‌లోనే..!

-

నోకియా నుంచి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. అదే Nokia C21 ప్లస్‌.. ఈ మధ్యే కంపెనీ జీ11 ప్లస్‌ ఫోన్‌ కూడా లాంచ్‌ చేసింది. ఇది కూడా బడ్జెట్‌ ఫోనే. మరీ ఈ కొత్త ఫోన్‌ కథేంటో మీరు చూడండి..!

నోకియా సీ21 ప్లస్ ధర..

ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,299గా ఉంది.
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,299గా నిర్ణయించారు.
డార్క్ సియాన్, వార్మ్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

నోకియా సీ21 ప్లస్ స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 191 గ్రాములుగా ఉంది.

కెమెరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ ఉంది..దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
మార్కెట్‌లో ఇప్పటికే చాలా బడ్జెట్‌ ఫోన్లు ఉన్నాయి. దేనికి అదే తన భిన్నమైన ఫీచర్స్‌తో కష్టమర్స్‌ను యట్రాక్ట్‌ చేసుకుంటుంది. ఇండియన్స్‌కు నోకియా బ్రాండ్‌ అంటే అపారమైన నమ్మకం. కీపార్డ్‌ ఫోన్లప్పుడే నోకియా మంచి హావా నడిపించింది. ఇక స్మార్ట్‌ ఫోన్లు తయారుచేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తుంది. ఈ ఫోన్ కష్టమర్స్‌ను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.!

Read more RELATED
Recommended to you

Latest news