ఆగస్టు 17న లాంచ్‌ కానున్న Vivo V25 Pro.. స్పెసిఫికెషన్స్‌ ఇవే..!

-

వివో నుంచి కొత్త ఫోన్‌ ఆగస్టు 17న లాంచ్‌ కానుంది. Vivo V25 Pro లాంచ్‌ కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
వివో వీ25 ప్రో వివరాలు..
ఈ స్మార్ట్ ఫోన్‌లో కలర్ ఛేంజింగ్ బ్యాక్ డిజైన్ ఉండనుందని వివో ఇప్పటికే ప్రకటించింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించనున్నారు. వ్లాగింగ్, నైట్ వీడియోగ్రఫీ కోసం హైబ్రిడ్ వీడియో స్టెబిలేషన్ కూడా అందించారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4830 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను వివో వీ25 ప్రో సపోర్ట్ చేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
కంపెనీ ధర ఎంతని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.రూ.40 వేల నుంచి ప్రారంభం కానుంది.
ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.
వివో ఇటీవలే తన రెండు స్మార్ట్ ఫోన్ల ధరను మనదేశంలో తగ్గించింది. అవే వివో వీ23ఈ, వివో వై21టీ. వీటిలో వివో వీ23ఈ 5జీ ధర రూ.24,999 నుంచి ప్రారంభం కానుంది.వివో వై21టీను రూ.15,499కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు కొత్త ధరలకే అందుబాటులో ఉన్నాయి. వివో వీ23ఈ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లోనూ, వివో వై21టీ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లోనూ లాంచ్ అయ్యాయి.
వీవో వీ 25 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ గురించి ఎప్పటినుంచో వార్తలు వింటూనే ఉన్నాం. ఎట్టకేలకు ఫోన్‌ ఈ నెలలో లాంచ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news