కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి ఆమె తీవ్ర జలుబుతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీకి ఇవాళ కరోనా పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షల్లో సోనియాగాంధీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్ లోకి వెళ్లింది.
ఈ విషయాన్ని జయరాం రమేష్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మధ్యలో కాలంలో.. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఆ సూచనలు చేశారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యం మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. కాగా అటు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాల కారణంగా ప్రస్తుతం ఆయన కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.