ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త ఫోన్లను లాంచ్‌కు రెడీ చేసింది. అక్టోబర్ 4న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో అక్టోబర్ 4వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
షావోమీ 12టీ ప్రోలో వెనకవైపు 200 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ1 సెన్సార్‌ను అందించనున్నట్లు సమాచారం. మోటొరోలా ఎక్స్30 ప్రో, ఎడ్జ్ 30 అల్ట్రాల్లో కూడా ఇదే సెన్సార్‌ను అందించారు. ఈ ఈవెంట్ విషయానికి వస్తే… రెడ్‌మీ ప్యాడ్ ట్యాబ్లెట్, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
షావోమీ 12టీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధర 649 యూరోలుగానూ అంటే సుమారు రూ.51,500గా, షావోమీ 12టీ ప్రో ధర 849 యూరోలుగానూ అంటే సుమారు రూ.67,000గా ఉండనుందని గతంలోనే లీకులు వచ్చాయి. అసలు ధర తెలియాలంటే.. లాంచ్ వరకు ఆగాల్సిందే.
షావోమీ 12టీ ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)..
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నట్లు సమాచారం.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.
డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ అందుకునే అవకాశం ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై షావోమీ 12టీ ప్రో పని చేయనుంది.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లు ఇందులో ఉండనున్నాయి.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అందించనున్నారు.
షావోమీ 12టీ స్పెసిఫికేషన్లు (అంచనా)..
దీని ఫీచర్లు దాదాపుగా ప్రో వేరియంట్ తరహాలోనే ఉండనున్నాయని సమాచారం… అయితే 200 మెగాపిక్సెల్ సెన్సార్‌కు బదులు 108 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.