2020లో ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్న‌ది ఈ యాప్‌ల‌నే..!

-

గ‌డిచిన 2020 సంవ‌త్స‌రంలో ఎవ‌రికీ అస‌లు మంచి జ‌ర‌గ‌లేదు. ఎన్నో కోట్ల మంది ఉద్యోగాల‌ను పోగొట్టుకున్నారు. చాలా మంది నెల‌ల త‌ర‌బ‌డి ఇళ్ల‌కే ప‌రిమిత‌మయ్యారు. అయితే ఈ కాలంలో డిజిట‌ల్ మాధ్య‌మం వాడ‌కం పెరిగింది. అనేక యాప్‌ల‌ను జ‌నాలు వాడ‌డం మొద‌లు పెట్టారు. దీంతో అనేక యాప్‌ల‌కు చెందిన నిర్వాహ‌కుల‌కు 2020లో బాగా క‌ల‌సి వ‌చ్చింది. ఇక 2020 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఏయే యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

most downloaded apps in 2020

2020లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా టిక్‌టాక్‌ను 850 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మ‌న దేశంలో ఈ యాప్‌ను బ్యాన్ చేసినా 100 మిలియ‌న్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్న‌ట్లు తెలిసింది. అలాగే ప్ర‌పంచంలో 2020లో అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్ ల‌లో వాట్సాప్ రెండో స్థానంలో ఉంది. దీన్ని 650 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇక ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా ఫేస్‌బుక్ (540 మిలియ‌న్లు), ఇన్‌స్టాగ్రామ్ (504 మిలియ‌న్లు), ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ (404 మిలియ‌న్లు), జూమ్ (250 మిలియ‌న్లు), స్నాప్‌చాట్ (281 మిలియన్లు), నెట్‌ఫ్లిక్స్ (223 మిలియ‌న్లు) యాప్‌లు నిలిచాయి. లాక్‌డౌన్ కార‌ణంగా జ‌నాలు ఎక్కువగా ఇండ్ల‌లోనే ఉండ‌డంతో సోష‌ల్ యాప్స్‌తోపాటు వీడియో కాన్ఫ‌రెన్స్ యాప్ లు, ఓటీటీ యాప్ ల‌ను అధిక సంఖ్య‌లో డౌన్‌లోడ్ చేసుకుని వాడిన‌ట్లు యాప్‌టోపియా అనే సంస్థ వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Latest news