వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఏడు రోజుల్లో మెస్సేజ్ లన్నీ మాయం..

-

ఫేస్ బుక్ సొంతం చేసుకున్న వాట్సాప్ మెస్సెంజర్ నుండి సరికొత్త ఫీచర్ బయటకి వచ్చింది. సాధారణంగా వాట్సాప్ లో మనం చేసిన మెస్సెజ్ ని డిలీట్ చేసుకునే వెసులు బాటు అందుబాటులో ఉంది. అయితే దానికి కొంత టైమ్ పీరియడ్ ఉంది. ఈ రోజు చేసిన మెస్సేజ్ రేపు డిలీట్ చేయడానికి అవకాశం లేదు. అలాగే కేవలం మనం చేసిన మెస్సెజ్ ని మాత్రమే డిలీట్ చేయవచ్చు. ఇతరుల నుండి మనకి వచ్చిన మెస్సెజ్ లని డిలీట్ చేయడానికి క్లియర్ చాట్ చేయాల్సి ఉంటుంది.

ఇక నుండి ఇలా కాకుండా వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. దాని ప్రకారం ఏదైనా మెస్సెజ్ ఏడు రోజుల్లో డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిసప్పియర్ మెస్సెజెస్ అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యక్తిగత చాట్ గానీ గ్రూప్ చాట్ గానీ ఏడు రోజుల్లో పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం కొత్తగా వస్తున్న ఈ ఫీచర్ వల్ల మునుపటి మెస్సెజ్ లకి ఎలాంటి సమస్య ఉండదు.

ఈ ఫీచర్ ని ఆన్ చేసుకోవడానికి వాట్సాప్ ఓపెన్ చేసి, కాంటాక్టుల మీద టాప్ చేసి కావాల్సిన కాంటాక్టుని ఎన్నుకుని డిసప్పియర్ మెస్సెజెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ ఆన్ అనే బటన్ మీద నొక్కాలి. అంతే డిసప్పియర్ మెస్సెజెస్ ఆన్ అయిపోయి అప్పటి నుండి ఆ కాంటాక్ట్ ద్వారా వచ్చిన మెస్సెజ్ లన్నీ ఏడురోజుల్లో మాయం అయిపోతాయి.

ఒకవేళ ఆఫ్ చేసుకోవాలంటే అదే పద్దతిలో ఆఫ్ చేసుకోవచ్చు. ఐతే ఈ ఫీచర్ ఫార్వార్డెడ్ మెస్సెజ్ లకి వర్తించదు. అలాగే ఏ మెస్సేజ్ తర్వాత ఏ మెస్సేజ్ డిలీట్ చేయబడాలో చెప్పడానికి టైమ్ సెట్ చేసుకునే అవకాశం లేదు.

మరి మెస్సెజెస్ డిలీట్ అయితే మీడియా సంగతి ఏంటనేది ప్రశ్న.

వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ అయిన మీడియా కూడా ఏడు రోజుల్లో మాయం అయిపోతుంది. ఐతే ఆటోమాటిక్ డౌన్లోడ్ ఆన్ లో ఉంటే మాత్రం ఫోటోలన్నీ ఫోన్లోనే ఉంటాయి. సో.. డిసప్పియర్ మెస్సెజెస్ ఆన్ చేయాలనుకుంటే ఆటో డౌన్లోడ్ ఆఫ్జ్ చేసుకోవాలి.

ఐతే ఈ ఆప్షన్ ని మనకి నమ్మకం ఉన్నవారి కాంటాక్టులకి మాత్రమే ఉపయోగించాలి. తెలియని వారి చాట్ డిసప్పియర్ చేయాలనుకుంటే ఆ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఉంచుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news